40.2 C
Hyderabad
April 26, 2024 13: 54 PM
Slider మహబూబ్ నగర్

అభివృద్ధి కోసం అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయం

#niranjanreddy

ప్రభుత్వ పథకాలను అమలు అయ్యేలా వనపర్తి జిల్లా అభివృద్ధి పథంలో సాగేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం వనపర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో ఆయన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 5వ తేదీన “ప్రపంచ నేల దినోత్సవం” జరుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామ, మండల స్థాయిలలో కంటి పరీక్షలు నిర్వహించి, కంటి అద్దాలను అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆరోగ్య కేంద్రాలు, వెల్ నెస్ సెంటర్లను అన్ని మండలాలకు ఏర్పాటు చేయుటకు కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు.

మన ఊరు- మనబడి కార్యక్రమం కింద (111) పనులు రూ.2896.26 లక్షలు లక్ష్యం ఉండగా రూ.462.71 లక్షలు ఖర్చు చేసినట్లు (37) పనులు పూర్తి చేసినట్లు, (46) పనులు ప్రగతిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. గొర్రెలు, మేకలలో పి పి ఆర్ వ్యాధి నిరోధక టీకాలను అందించడం జరిగిందని ఆయన తెలిపారు. దీని ద్వారా 2078 మంది రైతులు లబ్ది పొందినట్టు ఆయన చెప్పారు. వివిధ రంగాలకు మొత్తం (5,507) పనులు రూ.40715.87 లు లక్ష్యం వుండగా, రూ.6602.29 లక్షలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో 2342 పనులు పూర్తి చేసినట్లు, 2035 పనులు పురోగతిలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ జనవరి నెలలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమము ప్రారంభించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించాలని ఆమె తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా ఆరోగ్యశాఖకు అందరి ఆమోదంతో రూ.14 లక్షల 10 వేలు తీర్మానం చేసి బదిలీ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పి.హెచ్.సి) ల పునర్నిర్మాణానికి రూ.2 కోట్ల 11 లక్షలు ప్రభుత్వ ఆదేశానుసారం చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జెడ్పి సీఈవో వెంకట్ రెడ్డి, జిల్లా అధికారులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

మహానాడులో ఒంగోలు దళిత డిక్లరేషన్ పై తీర్మానం చేయండి

Bhavani

ఘనంగా జరిగిన తీజ్ పండుగ వేడుకలు

Satyam NEWS

A real Change: ఛత్తీస్ గఢ్ లో ఇక ట్రాన్ జెండర్ కానిస్టేబుళ్లు

Satyam NEWS

Leave a Comment