39.2 C
Hyderabad
April 28, 2024 11: 38 AM
Slider జాతీయం

A real Change: ఛత్తీస్ గఢ్ లో ఇక ట్రాన్ జెండర్ కానిస్టేబుళ్లు

#Transgenders

దేశంలో మార్పు మొదలైంది. నిజం. ఈ విషయం తెలుసుకుంటే ఆ విషయాన్ని మీరూ అంగీకరిస్తారు. ఛత్తీస్ గఢ్ పోలీసులు ఇటీవల రిక్రూట్ మెంట్ మేళా నిర్వహించారు.

ఆ రిక్రూట్ మెంట్ మేళాలో 13 మంది లింగమార్పిడి చేయించుకున్న వారు పోలీసు కానిస్టేబుళ్లుగా ఎంపిక అయ్యారు.

ఛత్తీస్ గఢ్ లోని మొత్తం నాలుగు జిల్లాల్లో ఈ పదమూడు మంది ట్రాన్స్ జెండర్లు పని చేయబోతున్నారు. ఒక్క రాయ్ పూర్ రేంజ్ నుంచే మొత్తం 9 మంది ఈ క్యాటగిరిలో ఎంపిక కావడం గమనార్హం.

మొత్తం 20 మంది ట్రాన్స్ జెండర్లు పరీక్షకు హాజరు కాగా 13 మంది ఎంపిక అయ్యారు. దేశంలో ఇప్పటి వరకూ ఇద్దరు ట్రాన్స్ జెండర్లు మాత్రమే పోలీసు శాఖలో పని చేస్తున్నారు.

ఒకరు తమిళనాడులో మరొకరు రాజస్థాన్ లో మాత్రమే ఉండగా ఇప్పుడు ఛత్తీస్ గడ్ లో 13 మంది రిక్రూట్ అయ్యారు.

Related posts

బరిలోకి బాలయ్య.. ముఖ్య నేతలతో కీలక సమావేశం

Bhavani

రాజధానిపై అగ్గి రాజేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ

Sub Editor 2

విశాఖ బీజేపీ నేత పి విష్ణు కుమార్ రాజు హౌస్ అరెస్ట్

Satyam NEWS

Leave a Comment