30.7 C
Hyderabad
April 29, 2024 03: 16 AM
Slider పశ్చిమగోదావరి

పర్మినెంటు పంచాయితీ కార్యదర్శి లేక ఇబ్బంది

#Parasaram Bhaskara

ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పాక గ్రామ పంచాయతీ కి కొన్నాళ్లుగా పర్మినెంట్ పంచాయతీ కార్యదర్శి లేక పరిపాలన కుంటు పడుతుందని గ్రామసర్పంచ్ పరాసరం భాస్కర దీక్షిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంచార్జి కార్యదర్శులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి ఏర్పడిందని సర్పంచ్ అన్నారు.

గ్రామ సమస్యలు చెప్పుకునేందుకు నాథుడు లేకుండా పోయాడని ఆయన అన్నారు. ఇంచార్జి కార్యదర్శులు సర్పంచ్ లకు చెప్పా పెట్టకుండా వచ్చి ఎవరితో పనిలేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు.ఒక్కొక్కసారి వారం రోజులు కూడా పంచాయతీకి రాని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ప్రజలు కార్యదర్శి కోసం పంచాయతీకి అక్కడ లేకపోతే సర్పంచ్ ఇంటికి వచ్చి కార్యదర్శి కొప్పాక పంచాయతీకి ఉన్నాడా లేడా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సర్పంచ్ భాస్కర్ దీక్షిత్ తెలిపారు.

Related posts

అనారోగ్యం తో బాధపడుతున్న నిరుపేద యువకుడికి తస్లీమా సాయం

Satyam NEWS

ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ని ప్రారంభించిన బండారు

Satyam NEWS

విజయనగరం యూత్ సేవలను మెచ్చుకున్న డీజీపీ

Satyam NEWS

Leave a Comment