38.2 C
Hyderabad
April 28, 2024 21: 57 PM
Slider విజయనగరం

విజయనగరం యూత్ సేవలను మెచ్చుకున్న డీజీపీ

#VijayanagaramSP

కరోనా విపత్కర పరిస్థితుల్లో ఏపీ రాష్ట్రం విజయనగరం జిల్లాలో విశేషమైన సేవలందించిన “విజయనగరం యూత్” ఫేస్బు క్ పేజ్ బృందాన్ని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ‘మానవత్వధీర’ అవార్డు ఇస్తూ ఆ బృందాన్ని జిల్లా ఎస్పీ సమక్షంలో అభినందించారు.

జూమ్ కాన్ఫరెన్స్ తో కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విశేషమైన సేవలందించిన స్వచ్చంద సంస్థలతో సమావేశమం నిర్వహించారు.

వివిధ సంస్థలు కరోనా సమయంలో అందించిన సేవలను అడిగి తెలుసుకొని, వారి సేవలను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలను చేపట్టి, రాష్ట్ర ఉన్నతికి పాటుపడాలన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మా ట్లాడుతూ – లక్షలు, కోట్లును వెచ్చించినా కరోనా సమయంలో మీరందించిన సేవలకు వెలకట్టలేమన్నారు. గతంలో ఎన్నడూ ఇటువంటి విపత్కర పరిస్థితి ఎదురుకాలేదని, బంధాలు, బాంధవ్యాలను దూరం చేసి, ఎన్నో కుటుంబాల్లో కరోనా విషాదాన్ని మిగిల్చిందన్నారు.

స్వంత కుటుంబ సభ్యులు చనిపోతే వెళ్ళలేని, అంత్యక్రియలు జరుపుకోలేని దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఒక కుటుంబ ఇంటి పెద్దను కోల్పోతే, మరో కుటుంబం ఇంటి ఇల్లాలిని కోల్పోయిందన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలు తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా జాతి, కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా మానవత్వమే పరమావధిగా వారి సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించి, బాధితుల కుటుంబాల పట్ల ఆపద్భాంధవులయ్యారన్నారు.

కరోనా సమయంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా సేవలందించినా అందరినీ సత్కరించుకొనే అవకాశం లేకపోయినా కొంతమందినైనా సత్కరించుకొనే అవకాశం లభించినందుకు గర్వంగా ఉందన్నారు. అటువంటి గొప్ప వ్యక్తులను గౌరవించడం సమాజంలోని మానవత్వాన్ని గౌరవించడంగా భావిస్తున్నా మని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.

విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ‘విజయనగరం యూత్’ అనేక రకాలైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్రజల మన్ననలను పొందుతుందన్నారు. కరోనా కష్ట కాలంలో విజయనగరం యూత్ ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి కరోనా మృతులు, అనాధ శవాలకు వారి సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారన్నారు.

అంతేకాకుండా, ప్లాస్మా దాతలుగా, ఆక్సిజన్ సిలిండర్స్ అందించడంలోను, మందులు, ఆహార సరఫరా చేయడంతోపాటు కరోనా బాధితులను ఆసుపత్రులకు తరలించేందుకు ఐదు అంబులెన్సులను సమకూర్చి, వారికి ఉచితంగా సేవలందిస్తున్నారని ‘విజయనగరం యూత్’ సేవలను రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు జిల్లా ఎస్పీ రాజకుమారి వివరించారు.

జిల్లాలో కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించి, సేవా కార్యక్రమాలను చేపట్టిన మరికొన్ని స్వచ్ఛంద సంస్థలను గుర్తించామని వారిని కూడా త్వరలో సత్కరించనున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.

అనంతరం, రాష్ట్ర డీజీపీ కార్యాలయం ప్రత్యేకంగా రూపొందించి జిల్లా పోలీసుశాఖకు పంపిన ‘మానవత్వ ధీర’ అవార్డును జిల్లా ఎస్పీ రాజకుమారి చేతుల మీదుగా ‘విజయనగరం యూత్’ ఫేస్ బుక్ బృందం సభ్యులు ఇల్తామాస్, నడుకూరి ఈశ్వరరావు (శివ), అయ్యప్ప అమరలకు అందజేసి, వారిని అభినందించి, సాలువలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎస్బీ సీఐ జి. రాంబాబు, ఎస్పీ పిఎ కే. కృష్ణమూర్తి, పోలీసు పీఆర్వో కోటేశ్వరరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

శాస్త్ర‌, సాంకేతిక రంగాల్లో బ‌హుముఖ ప్ర‌గ‌తి…

Satyam NEWS

సస్పెండ్ అయిన అధికారులు అప్రూవర్లు గా మారాలి

Satyam NEWS

మహనీయులు నడియాడిన నగరంలో శ్లీ ప్లవ నామ వేడుకలు

Satyam NEWS

Leave a Comment