39.2 C
Hyderabad
April 28, 2024 13: 23 PM
Slider నిజామాబాద్

వికలాంగుల సదస్సును జయప్రదం చేయాలి

yellareddy 11

వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రేషన్ కార్డు ఇవ్వాలని మార్చి 16న ఎల్లారెడ్డి ఆర్డిఓ కార్యాలయం ముందు జరిగే సదస్సును జయప్రదం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఏం అడివయ్య పిలుపునిచ్చారు. 

బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుఏం బస్వరాజ్ జిల్లా అధ్యక్షులు డి ఇ గంగాధర్ చారి కార్యదర్శి గోనే సాయిరాం ఎల్లారెడ్డి  నాయకులు చిలుక కాశీరాం లతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు నాలుగు లక్షల 99 వేల మందికి పింఛన్లు వస్తున్నాయని అన్నారు.

40 శాతం వైకల్యం ఉన్నా వికలాంగుల అందరికీ  పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన ఇరవై ఒక్క రకాల వైకల్యాలను ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని, సంక్షేమ పథకాల్లో 5% వికలాంగులకు కేటాయించాలని, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని అని అన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఐదు శాతం వికలాంగుల కేటాయించాలని, కట్ చేసిన రేషన్ కార్డు ప్రతి వికలాంగునికి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎలాంటి షరతులు లేకుండా 100 శాతం సబ్సిడీతో 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, నిరుద్యోగ వికలాంగులకు ఐదు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

పెండింగ్లో ఉన్న వికలాంగుల వివాహ ప్రోత్సాహకం వెంటనే విడుదల చేయాలని, ఇద్దరు వికలాంగులు పెళ్లి చేసుకుంటే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని, చదువు తో నిమిత్తం లేకుండా తీవ్రతను బట్టి మోటార్ సైకిల్ ఇవ్వాలని, వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం, నాలుగు శాతం ఉద్యోగాలు వికలాంగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో 150 రోజులు వికలాంగులకు పని కల్పించాలని , ప్రతి గ్రామంలో వికలాంగులతో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేయాలని అన్నారు. వికలాంగుల పై జరుగుతున్న వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల పింఛన్లు చెల్లించకపోవడం ద్వారా వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 2020- 21 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగులకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. ఆసరా పెన్షన్ నిధులు కేటాయిస్తామని చెప్పి వికలాంగుల సంక్షేమానికి ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు.

ఆర్థిక మంత్రి ప్రసంగం వికలాంగుల సంక్షేమం విస్మరించిందని బడ్జెట్లో నిధులు కేటాయించకుండా వికలాంగుల సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఏమిటని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నించారు. బడ్జెట్ సవరించి వికలాంగుల సంక్షేమానికి ఐదు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

మహిళా వికలాంగుల పై  వేధింపులు అరికట్టాలని  లైంగిక వేధింపుల నివారణ కోసం  ప్రత్యేక చట్టం చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలను ర్యాంపులు నిర్మించాలని డిమాండ్ చేశారు మార్చి 16న ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయం దగ్గర జరిగే సదస్సులో నియోజకవర్గంలోని వికలాంగుల అంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Related posts

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల పేరిట సైబర్ మోసాలు

Bhavani

మన్సుఖ్ హిరేన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రదీప్ శర్మ

Satyam NEWS

తూర్పు గోదావరి జిల్లా లో అశ్లీల నృత్యాల ప్రదర్శన

Satyam NEWS

Leave a Comment