33.7 C
Hyderabad
April 28, 2024 23: 35 PM
Slider హైదరాబాద్

ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి ఏంటో చూపిస్తా

#uppal

ఉప్పల్  బి ఆర్   ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి

ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఎన్నికల్లో మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి ఏంటో చూపిస్తానని ఉప్పల్ నియోజకవర్గ  బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం లక్షారెడ్డి కమ్యూనిటీ హాల్ లో మేకల హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొనగా బండారి లక్ష్మారెడ్డి  కార్యకర్తలకు ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రతి కార్యకర్తకు అందుబాటులో వుంటా అని అందరినీ కలుపుకొని వెళ్తా అని ఏలాంటి గ్రూప్ రాజకీయాలకు తావులేకుండా  బి ఆర్  ఎస్ పార్టీ కార్యకర్తల అందరూ నా కుటుంబ సభ్యులే అని అన్నారు. ఎన్నికల్లో మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  బి ఆర్ ఎస్  సీనియర్ నాయకులు మేకల మధు సుదన్ రెడ్డి, గోనె అర్జున్ రెడ్డి, కాయ హనుమంత్, రంగనాథ్ గౌడ్, జంగీర్, ప్రేమ్ సాగర్ రెడ్డి, ఇంద్ర రాణి, సలీం, జెట్ట సుధాకర్,మేకల వెంకట్ రెడ్డి, గోనె విద్యా సాగర్ రెడ్డి, గోనె ప్రభకర్ రెడ్డి, రాం చందర్ రెడ్డి ,కాలనీ వాసులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

సేవా కార్యక్రమంలో ట్రాఫిక్, ఆర్మర్డ్ పోలీసులు..!

Satyam NEWS

కార్తి హీరోగా 25న వస్తున్న వెరైటీ కథాచిత్రం

Satyam NEWS

22 ఏళ్లయినా `కార్గిల్’ గుణపాఠం గ్రహించలేక పోతున్నామా?

Satyam NEWS

Leave a Comment