39.2 C
Hyderabad
May 3, 2024 11: 38 AM
Slider కృష్ణ

జగన్ పాలనలో అవినీతిపై రఘురామ ‘పిల్’

#raghu

నాలుగున్నరేళ్ల పాలనలో వై ఎస్ జగన్ ప్రభుత్వం భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.  జగన్ రెడ్డి పాలనలో చోటుచేసుకున్న అవినీతి నిగ్గు తేల్చాలని ఆయన ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. మొత్తం 1,311 పేజీలతో రఘురామ రాజు తరపున న్యాయవాది ఉన్నం మురళీధర్ సుదీర్ఘ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సీఎం జగన్, అయన మంత్రివర్గం, పలువురు సీనియర్ అధికారులతో సహా మొత్తం 41 మందిని ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి, బెవరేజస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిలను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిల్ ను స్వీకరించిన ఏపీ హైకోర్టు నెంబరు కూడా కేటాయించింది. సీఎం జగన్ పై ఉన్న అక్రమ ఆస్తుల కేసుల విచారణ విషయం తేల్చాలని, కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కూడా సుప్రీంకోర్టును రఘురామ ఆశ్రయించారు.

ఈ మేరకు ఏ శాఖలో ఎలా అవినీతి జరిగిందన్న విషయాన్ని రఘురామ వివరంగా తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రజాధనానికి నష్టం కలిగించేలా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని వివరించారు. సాక్షి పత్రిక, సాక్షి చానల్ కు లబ్ది కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. సీఎస్ సహా పలువురు ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని కూడా రఘురామ తన పిటిషన్ లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మొత్తం 1,311 పేజీలతో రఘురామ న్యాయవాది ఉన్నం మురళీధర్ సుదీర్ఘ పిటిషన్ దాఖలు చేశారు. మద్యం ఇసుక, అంబులెన్స్ ల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. పోర్టులను అనుచరులకు కట్టబెట్టే క్రమంలో భారీ అవినీతికి పాల్పడ్డారని వివరించారు.

టర్న్ కీ ఎంటర్ ప్రైజెస్ ద్వారా ఇసుక కుంభకోణానికి పాల్పడ్డారని ఆ పిటిషన్ లో తెలిపారు. పేదలందరికీ ఇళ్లు అనే పథకం ద్వారా ప్రైవేటు వ్యక్తుల స్థలాలను కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని వెల్లడించారు. ఎక్సైజ్ పాలసీని మార్చి భారీ ఎత్తున మద్యం అక్రమాలకు పాల్పడ్డారని రఘురామ తన పిటిషన్ లో ఆరోపించారు. భారతీ సిమెంట్స్ కు కూడా లబ్ది కలిగేలా వ్యవహరించారని, ప్రభుత్వానికి సరఫరా చేసే సిమెంట్ రెడ్ బ్యాగ్ లలో ఇవ్వాలని నిబంధన విధించిన అంశాన్ని కూడా పిటిషన్ లో ప్రస్తావించారు. అన్ని సిమెంట్ కంపెనీలు ఇక్కడే భారతీ పాలిమర్స్ నుంచి రెడ్ బ్యాగ్ లు కొనుగోలు చేయాలని నిబంధన విధించినట్టు వివరించారు.

Related posts

జీఎంఆర్ పై టీడీపీ నేత ఘాటు విమర్శలు…..

Bhavani

నీట్, జేఈఈ ఆన్ లైన్ ప్రాక్టీస్, గ్రాండ్ టెస్ట్స్ సిద్ధం

Satyam NEWS

తొలి బ్యాచ్ ఆర్టీసీ శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్లు

Satyam NEWS

Leave a Comment