రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు ప్రవేశపెట్టి ఫీల్డ్ అసిస్టెంట్ లను ఇబ్బందికి గురి చేస్తోందని, 4 7 7 9 జీవోను వెంటనే రద్దు చేయాలని బిచ్కుంద మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు కోరారు. వా తమ విధులను బహిష్కరించి గురువారం ఎంపీడీవో ఆనంద్, ఎంపీపీ అశోక్ పటేల్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం అధ్యక్షులు గణపతి మాట్లాడుతూ జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీకి ఖచ్చితంగా 40 దినాలు పని కల్పించాలని నిబంధనలు పెట్టి ఫీల్డ్ అసిస్టెంట్లను ఇబ్బందులకు గురి చేస్తుందని వారన్నారు.
వచ్చే వేతనాల్లో కోతలు విధించడంతో జీవనోపాధి భారంగా మారిందని గత 15 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న తమకు ఉద్యోగం కోల్పోయే అభద్రతా భావం కలుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే 4 7 7 9 జీవోను రద్దు చేయాలని వారు కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఉపాధ్యక్షులు బాలయ్య, కార్యదర్శి వీరేశం, నాగ గొండ, నర్సింలు, శ్రీనివాస్, మధు, రాజు, సాయిలు ఫీల్డ్ అసిస్టెంట్ లు ఉన్నారు.