32.7 C
Hyderabad
April 27, 2024 00: 44 AM
Slider హైదరాబాద్

ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి

#abvpuppal

పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్పులు, ఫీజు రియంబర్స్మెంట్ లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కో కన్వీనర్ ఒగ్గు కార్తీక్ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ.సీ.ఐ.ఎల్ శాఖ ఆధ్వర్యంలో  శనివారం ఈ.సీ.ఐ.ఎల్ చౌరస్తాలో  డిమాండ్ చేస్తూ కెసిఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా ఎ.బి.వి.పి రాష్ట్ర కో కన్వీనర్ వగ్గు కార్తీక్ (టెక్నికల్ సెల్) మాట్లాడుతూ ” విద్యార్థులు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రం లో నేడు ప్రభుత్వం విద్యార్థులను ఉపకారవేత్తనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ లు చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురి చేయడం చాలా దారుణం అన్నారు. స్కాలర్షిప్ లు ప్రభుత్వ భిక్ష కాదు అని, పేద విద్యార్థుల హక్కు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ లు సకాలంలో చెల్లించకపోవడంతో ఫైనల్ ఇయర్ పూర్తయిన విద్యార్థులు సర్టిఫికేట్లు అందక ఉద్యోగాలకు ఇబ్బంది గా ఉందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని పెండింగ్ లో ఉన్న ఉపకారవేత్తనాలు, ఫీజు రియంబర్స్ మెంట్ లు వెంట వెంటనే విడుదల చేయాలి” అని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఈ.సీ.ఐ.ఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రుద్వి జీ, ఉప్పల్ విభాగ్  సాందీపని కన్వీనర్ రాకేష్, ఈ.సీ.ఐ.ఎల్ కార్యదర్శి ఉమేష్ చంద్ర, ఏ.ఎస్.రావు నగర్ కార్యదర్శి చరణ్, ఆదర్శ్, తబ్రేష్ ఖాన్, సిద్దార్థ్, జశ్వంత్, జోయల్, కళ్యాణ్ చారి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ సత్య న్యూస్ ప్రతినిధి

Related posts

కార్మికులారా ఏకంకండి హక్కులు సాధించే వరకు పోరాడుదాం

Satyam NEWS

భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న మంత్రి

Sub Editor

నారాయణ పరివారానికి ముందస్తు బెయిల్ మంజూరు

Satyam NEWS

Leave a Comment