సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ను సౌత్ సెంట్రల్ జోనల్ కమిటీ మెంబర్ యరగాని నాగన్న గౌడ్ మంగళవారం సందర్శించారు.
మఠంపల్లి స్టేషన్ మేనేజర్ కె.వి.యస్ శ్రీధర్ తో కలిసి రైల్వే స్టేషన్ పరిశీలించిన అనంతరం యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ మఠంపల్లి మీదుగా ప్యాసింజర్ రైలును వెంటనే ప్రారంభించాలని అన్నారు.గత మూడు సంవత్సరముల నుండి గూడ్స్ రైలు నడుస్తున్నాయని,ఈ ప్రాంతంలో దాదాపు 15 సిమెంటు పరిశ్రమలు ఉన్నాయని, హుజూర్ నగర్,జగ్గయ్యపేట నియోజకవర్గం లోని ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పించిన వారవుతారని అన్నారు.
తీగలచెరువు అండర్పాస్ సమస్యను పరిశీలించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ఇటీవల జరిగిన 73వ జెడార్ యుసిసి సమావేశంలో ఈ సమస్యను ప్రస్తావించినట్లు తెలిపారు. అక్టోబర్ 5న నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో ఈ సమస్యపై ఎజెండా రూపొందించారని అన్నారు.
ఈ ప్రాంతంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి లక్ష్మినరసింహ దేవాలయం, జాన్పహాడ్ దర్గాకు వచ్చే భక్తులకు ప్యాసింజర్ రైలు సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల కార్మిక వర్కింగ్ ప్రెసిడెంట్ వంటిపులి శ్రీనివాస్,మాజీ జెడ్పిటిసి అరుణ సైదులు, ఐ ఎన్ టి యు సి హుజూర్ నగర్ మండల అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి, మండల కాంగ్రెస్ నాయకుడు చిలక గురవయ్య, షేక్ కరీం,ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు దేవపంగు అచ్చయ్య, పి ఎ సి ఎస్ వైస్ చైర్మన్ బాబు నాయక్,పశ్యా నరసింహారెడ్డి, షేక్ సలాం, సైదులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్