40.2 C
Hyderabad
April 26, 2024 12: 44 PM
Slider సంపాదకీయం

తిరుమల తిరుపతి దేవస్థానం జీతాలు ఇచ్చే స్థితిలో లేదా?

#Sri Venkateswara Swamy 1

కరోనా కారణంగా గత 60 రోజులుగా భక్తులు రాకపోవడంతో తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ఆదాయం తగ్గిపోయిందని అందువల్ల తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిరర్ధక ఆస్తులను అమ్మివేసేందుకు అనుకూలమైన వాతావరణ కల్పించేందుకు వీలుగా ఇలాంటి పోస్టులతో లేనిపోని అనుమానాలు వచ్చేలా చేస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్ధిక ఒడిదుడుకులకు లోనవుతున్నదని చెప్పకనే చెబుతూ భూముల అమ్మకాన్ని పరోక్షంగా సమర్థించడం ఈ సోషల్ మీడియా పోస్టుల ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తున్నది. నిరర్ధక భూములు అమ్మితే తప్పేంటి? అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.

తెలుగుదేశం హయంలో భూముల అమ్మకం పై నిర్ణయం తీసుకుంటే అప్పుడు గొడవ చెయ్యని వారు ఇప్పుడు అరచి గగ్గోలు పెడుతున్నారని మరో వాదన లేవనెత్తుత్తున్నారు. ఈ వాదనలన్నీ నిరర్ధక ఆస్తుల పేరుతో భూములు అమ్మకోవడానికి సమర్ధించేవే వాదనలే.

స్వామివారికి అన్యాయం జరిగితే సహించం అంటున్నారు

టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఇచ్చిన వివరణలో కూడా తెలుగుదేశం హయంలో నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు అనే అంటున్నారు. వైసీపీకి చెందిన మరో ప్రముఖుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా తాము ఎట్టిపరిస్థితుల్లో స్వామివారికి అన్యాయం చేయమని, ఎవరైనా అన్యాయం చేస్తుంటే ఊరుకోమని కూడా కుండబద్దలు కొట్టారు.

అంత వరకూ సంతోషమే. ఈ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవుడు శ్రీ వేంకటేశ్వరుడు. ప్రపంచంలోనే అత్యధిక ధనార్జన కలిగిన పుణ్యక్షేత్రం తిరుమల. లాక్ డౌన్ వల్ల రెండు నెలలు కాదు 10 ఏళ్ళు భక్తులు రాక ఆదాయం తగ్గిపోయినా కూడా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే దుస్థితిలో కి టీటీడీ రాదు.

స్వామివారికి అన్యాయం చేయడం ఇష్టంలేని వారు మరి ఇలాంటి వాదనలు ఎందుకు తెస్తున్నారో అర్ధం కావడం లేదు. ఈ సృష్టిలో నిరర్ధక భూములు అంటూ ఏమీ లేవు. ప్రతి భూమి విలువ 20 ఏళ్ళ తరువాత కొన్ని వందల రెట్లు పెరుగుతుంది. 5 సెంట్లు, 10 సెంట్ల భూమి ఎందుకు పనికొస్తుంది?

వాటిని అమ్మితే తప్పేంటి? అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 5 సెంట్ల వ్యవసాయ భూమిలో ఏం పండిస్తాం అంటూ అమాయకంగా ప్రశ్నలు వేస్తూ సోషల్ మీడియలో ప్రచారం చేస్తున్నారు. 5 సెంట్ల భూమి అంటే దాదాపు 2300 sqft.  కేవలం 500 sqft స్థలం ఉంటే చాలు 2BHK ఇళ్ళు గొప్పగా కడుతున్నారు.

సామాజిక సేవ ఎంతో చేయవచ్చు

మరి 2300sqft లో ఏం చేయొచ్చు? 2500 sqfts లో ఒక గొప్ప దేవాలయం కట్టొచ్చు. 100 ఆవులను రక్షించే గోశాల కట్టొచ్చు. ఒకేసారి 500 మంది భక్తులు విష్ణు సహాస్ర నామం చేసే మండపం నిర్మించవచ్చు. 200 జంటలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసే మండపం కట్టొచ్చు. ఒక పెద్ద హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రాన్ని నిర్మించవచ్చు. స్వామి వారి పేరు మీద పెద్ద అనాథ శరణాలయం/ వృద్ధాశ్రమం నిర్మించవచ్చు.

ఇవేవీ చేయకుండా వాటిని తెగనమ్మాలనే నిర్ణయమే అనుమానాస్పదంగా ఉంది. ఇందులో పార్టీల ప్రమేయం లేదు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్లంతా తెలుగుదేశం వాళ్లయితే వై ఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న విశాఖ శారదా పీఠం అధినేత స్వరూపానందేంద్ర సరస్వతి కూడా భూములు అమ్మవద్దనే చెప్పారు మరి.

Related posts

రామ మందిర నిర్మాణానికి  గ్రానైట్ విరాళం

Satyam NEWS

ఒకేసారి 77 మంది డీఎస్పీ లకు స్థానచలనం…!

Satyam NEWS

ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన రావూరి సాయి అలేఖ్య

Satyam NEWS

Leave a Comment