39.2 C
Hyderabad
April 30, 2024 22: 26 PM
Slider ప్రత్యేకం

పోడు భూముల రైతుల సమస్య ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి

#kodandaram

రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూముల సమస్యలు ఎదుర్కొంటున్న రైతుల కు ప్రభుత్వం తక్షణమే పట్టాలు ఇచ్చి పరిష్కరించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. బుధవారం నాడు మండల పరిధిలోని మన్ననూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  పోడు భూముల సమస్యలపై జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ప్రభుత్వం ఇవ్వకుండా వేధిస్తోందని దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్న భూములకు పట్టాలు ఇవ్వకుండా ఉంటున్నారని దీంతో రైతులు పోరాటాలే శరణ్యంగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గత్యంతరం లేక ప్రజలు ఉద్యమాలవైపు సాగుతున్నారని అన్నారు .రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాల ద్వారానే నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని అందులో భాగంగానే అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.

వెల్దండ లో గెస్ట్ టీచర్ గణేష్ చారి 18 నెలలుగా వేతనాలు రాకా కుటుంబ పోషణ భారమై ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రాష్ట్రం లో నిరుద్యోగ సమస్య పెరిగి ఉద్యోగాలు రాక ఉన్నత విద్యాభ్యాసం చేసిన వారు పొట్టకూటి కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా నల్లమల ప్రాంతంలో జీవిస్తున్న ప్రజలు పులులు ఇతర జీవులతో సహవాసం చేస్తున్నారని పులులకే భయపడిన ప్రజలు కెసిఆర్ కు భయపడుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు.

2005 సంవత్సరం నాటికి సాగు చేసుకుంటున్న భూములకు కూడా పట్టాలు ఇవ్వలేదని ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. పట్టాలు ఉన్నా లేకున్నా ప్రభుత్వం భూములు గుంజు ఉంటున్నారని అన్నారు. దీంతో ముఖ్యంగా మహిళలు అధికారుల మీద ఎదురు ఎదురుదాడి చేస్తున్నారని ఆయన అన్నారు .

చట్టాలు అమలు చేయాల్సిన ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే ప్రజా తిరుగుబాటు ఉంటుందని  దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు .పోడు భూముల సమస్య పరిష్కారానికి 5న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రజలు విజయవంతం చేయాలని అన్నారు .

అనంతరం కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి మాట్లాడుతూ  నాడు పదవిలో ఉండి కెసిఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయో గుర్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ  దేశంలో సంస్కరణలు తీసుకు వస్తే వాటిని తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.

నాడు దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ  ద్వారా ఉద్యమాలు చేసి రైతుల పక్షాన అనేక సంస్కరణలు తీసుకు వచ్చిందని  అందుకు అనుగుణంగా కెసిఆర్ కూడా ఆనాడు ప్రభుత్వం లోనే ఉన్నారని అన్నారు. కోనేరు రంగారావు కమిటీ విధివిధానాలను నాటు టిఆర్ఎస్ ఒప్పుకుందని నేడు మాట మార్చి తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని అన్నారు.

అనేక వేల మందికి రాష్ట్రవ్యాప్తంగా కొత్త పుస్తకాలు అందడం లేదని కేవలం భూస్వాములకు మాత్రమే ఇస్తున్నారని పిల్లలను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు నేడు నిషేధిత జాబితాలో ఉన్నాయని అసైన్డ్ భూములు కూడా ఈ చట్టం ఉన్నా తుంగలో తొక్కి అది ప్రభుత్వ భూమిగా చిత్రీకరించి రైతుల నడ్డి విరుస్తున్నారని అన్నారు.

కాబట్టి రైతులు అధైర్య పడకుండా ఆత్మహత్యల వైపు దృష్టి సారించకుండా హక్కుల కోసం పోరాటం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం పిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రమంతా సమస్య పెరిగిపోయిందని పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ చట్టం తెచ్చి సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా అమలు చేసిందని అయితే అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ అన్ని రకాల హామీలను విస్మరించిన గాని రైతులకు ఇచ్చిన భూమి విషయంలో కూడా మాట తప్పిందని అన్నారు.

దళితులకు గిరిజనులకు మూడు ఎకరాలు ఇస్తామని హామీ ఇచ్చి డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదని రిజర్వేషన్ల విషయంలో మాట తప్పిందని అన్నారు .దళిత పేరు మీద రెండు వేల కోట్లు ఖర్చు పెడుతున్నా ప్రభుత్వం 65 వేల కోట్ల దళితుల డబ్బును కాజేశారని అన్నారు.

అందుకే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సారధ్యంలో దళిత గిరిజన దండోరా పేరుమీద ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారని అన్నారు. దళిత గిరిజన రైతుల పక్షాన నిలబడి కేవలం కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ అధికారంలో ఉందని కెసిఆర్ రాష్ట్రానికి రాబందు గా మారారని తన కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు ఇస్తున్న కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశారని ఆరోపించారు.

కాబట్టి ప్రజలు భయపడవద్దని ప్రజల పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉద్యమాలు చేస్తామని అన్నారు .అనంతరం కాంగ్రెస్ పార్టీ నీ ప్రధాన కార్యదర్శి వంశీచందర్ రెడ్డి,  వెంకటేష్ ముదిరాజ్ ,పార్లమెంటు ఇన్చార్జి రమేష్ ,ఎంపీపీ శీను ,లింగమ్మ ,తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Related posts

అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే మీకు ఇబ్బంది ఏంటి..?

Satyam NEWS

బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీ, మహిళలకు నామినేటెడ్ పదవులు

Satyam NEWS

లెక్క తప్పింది కోడెల కొట్టేసింది ఎక్కువే

Satyam NEWS

Leave a Comment