38.2 C
Hyderabad
May 2, 2024 21: 22 PM
Slider విజయనగరం

పరిషత్ ఎన్నికల కౌంటింగ్: 2000మందితో పోలీసు బందోబస్తు

#deepikaips

హైకోర్టు తీర్పు తో జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఎన్నికల కౌంటింగ్ కు సర్వత్రా సిద్ధమైంది. ఈ నెల 19న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రిరంభం కానుంది. ఈ మేరకు విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా ఎం పాటిల్ బందోబస్తు కై కసరత్తు చేసారు. దాదాపు 2వేల మందితో కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు పెట్టారు.

జిల్లా లో ఎం.పి.టి.సి. జేడ్పీటీసీ ఎన్నికల కౌంటింగు నిర్వహించే 34 మండల కేంద్రాల వద్ద మూడంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఎన్నికలకౌంటింగు ప్రక్రియను ఎటువంటి అల్లర్లు జరగకుండా, సజావుగా నిర్వహించేందుకు గాను అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టామన్నారు.

బందోబస్తు నిమిత్తం ఇద్దరు అదనపు ఎస్పీలు, 7గురు డీఎస్పీలు, 22మంది సీఐలు,ఆర్ ఐలు, 69మంది ఎస్ఐలు ,ఆర్ఎస్ఐలు, 281మంది ఎఎస్ఐలు,హెచ్ సిలు, 466మంది పీసీలు, 83మంది మహిళా కానిస్టేబుళ్ళు, 200మంది హెూం గార్డులు, 105మంది ఎస్టీఎఫ్ సిబ్బంది, 78మంది ఆర్మ్డ్ రిజర్వు సిబ్బంది, 135మంది సీఆర్ పీఎఫ్/ఏపీఎస్పీ, 443మంది ఎం.ఎస్.పి. లతో సహా సుమారు 2000 మందిని వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఒక్కొక్క కౌంటింగు కేంద్రానికి ఒక సీఐ స్థాయి అధికారిని, వారిని పర్యవేక్షించేందుకు మరో డీఎస్పీ స్థాయి అధికారిని నియమించామన్నారు. సబ్ డివిజను స్థాయిలో భద్రతా ఏర్పాట్లును పర్యవేక్షించేందుకు విజయనగరం సబ్ డివిజనుకు డీఎస్పీ అనిల్ కుమార్‌ను, బొబ్బిలి సబ్ డివిజనుకు అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, పార్వతీపురం సబ్ డివిజన్ కు ఒఎస్ డి ఎన్.సూర్యచంద్రరావును నియమించామన్నారు.

ఎన్నికల కమీషను సూచనలు మేరకు ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించే విధంగా చర్యలు చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. ప్రాదేశిక ఎన్నికల కౌంటింగు ప్రక్రియను చేపట్టే భోగాపురం, పూసపాటిరేగ కేంద్రాలను జిల్లా ఎస్పీ ఎం. దీపిక  సందర్శించి, అధికారులకు భద్రతాపరమైన సూచనలు చేసారు.

కౌంటింగు కేంద్రాల వద్ద 144 సీఆర్ పీసీ అమలు చేస్తూ సంబంధిత రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినందున ఇద్దరు కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడి ఉండరాదన్నారు. ఇప్పటికే 144 సీఆర్ పీసీ నిబంధనలు అమలులో ఉన్నట్లుగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారం కూడా చేసామన్నారు.

కౌంటింగు కేంద్రాల వద్ద ప్రజలు పాటించాల్సిన నియమ, నిబంధనల పట్ల అవగాహన కల్పించేందుకు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసామన్నారు. అంతేకాకుండా, కౌంటింగు కేంద్రాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లును నియమించామని, సీసీ కెమెరాలను, బాడీ వార్న్ కెమెరాలను, డ్రోన్లను కూడా వినియోగిస్తున్నామన్నారు.

కరోనా నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారి పై డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం 2005, భారత శిక్షా స్మృతి క్రింద చర్యలు చేపడతామన్నారు. కౌంటింగు కేంద్రాలకు కిలో మీటరు పరిధిలో పార్టీ జెండాలు, కర్రలు, ప్రేలుడు సామగ్రి, ఇతరు ఆయుధాలను ఎవ్వరూ కలిగి ఉండకూడదన్నారు. ప్రజలు గుంపులుగా చేరకుండాను, ర్యాలీలు నిర్వహించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.

కౌంటింగు కేంద్రాలకు సమీపంలో ఎటువంటి షామియానాలు, పందిర్లు వేయకుండాను, జనాలు వాటిలో గుంపులుగా ఉండకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలను ప్రభావితం చెయ్యకుండా పార్టీలకు చెందిన వ్యక్తులు పబ్లిక్ అడ్రసింగు సిస్టమ్స్ వినియోగించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇతరులను రెచ్చగొట్టే విధంగా సౌజ్ఞలు, సైగుల చేయడం, ప్లకార్డులను ప్రదర్శించడం నిషేదిస్తున్నామన్నారు.

ఎన్నికల్లో విజయం సాధించిన వ్యక్తితోపాటు ఇద్దరిని మాత్రమే దృవపత్రం అందుకొనేందుకు అనుమతిస్తామన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున, ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు, మందుగుండు సామగ్రిని అనుమతించమని చెప్పారు.

Related posts

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీకి గిడుగు రామ్మూర్తి పురస్కారం

Satyam NEWS

తెలంగాణ జాగృతి పట్టణ మహిళా కన్వీనర్ గా షేక్ రహీమా

Satyam NEWS

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 54 వ వర్ధంతి

Satyam NEWS

Leave a Comment