35.2 C
Hyderabad
April 27, 2024 13: 18 PM
Slider వరంగల్

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 54 వ వర్ధంతి

#cheguvera

చేగువేరా 54 వ వర్ధంతిని ములుగులో ఎస్ ఎఫ్ ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఒకడి కాలికింద బానిసలా నీచంగా బ్రతికే బదులు లేచి నిలబడి ప్రాణం విడిచి పెట్టడం మేలు అంటూ గర్జించిన యోధుడు చేగువేరా అని వక్తలు అన్నారు.

ఈ సందర్భంగా  ఎస్ ఎఫ్ ఐ, డివైఎఫ్ఐ ములుగు జిల్లా నాయకులు కుమ్మరి సాగర్ , కలువల రవీందర్, మాట్లాడుతూ యుక్తవయసులో మెడికల్ విద్యార్థిగా ఉన్న చేగువేరా లాటిన్ అమెరికా అంతా పర్యటించారు. అక్కడ ఉన్న బీదరికం చూసి పరివర్తన చెందారు.

ఈ పర్యటనలో అతని పరిశీలనలతో దేశంలో దృఢంగా ఉన్న ఆర్థిక తారతమ్యాలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, నూతన వలసవాదం, సామ్రాజ్యవాద ఫలితమేనని తుది నిర్ణయానికి వచ్చారు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ప్రపంచ తిరుగుబాటు అని భావించారని వారన్నారు.

తిరుగుబాటు తర్వాత చేగువేరా నూతన ప్రభుత్వంలో అనేక ప్రధాన పాత్రలను పోషించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా, వ్యవసాయ సంస్కరణలు ప్రవేశ పెట్టడం, జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా, క్యూబా సైనిక దళాల బోధన నిర్దేశకుడిగా క్యూబా సామ్యవాద తరపున ప్రపంచ  పర్యటనలు చేయడం వంటివి చేశాడని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు వేణు, బి ఎస్ పి పార్టీ జిల్లా అధ్యక్షులు పవన్, నవీన్, ప్రవీణ్, గణేష్, రమేష్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

శబరి యాత్రకు తరలివెళ్లిన వనపర్తి వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అయ్యప్ప స్వాములు

Bhavani

ఈ బఫూన్లు చెబితే చంద్రబాబు బెయిల్ రద్దు చెయ్యాలా?  

Satyam NEWS

క‌క్ష తీర్చుకోవ‌డానికే ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని వాడుతున్న సీఎం

Satyam NEWS

Leave a Comment