26.7 C
Hyderabad
April 27, 2024 07: 55 AM
Slider విజయనగరం

ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు 6000తో పటిష్ట బందోబస్తు

#RajakumariIPS

పరిషత్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. విజయనగరం జిల్లాలో ఈ నెల 8న జరగనున్న ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లుగా జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు.

జిల్లాలో 31 జెడ్పీటీసీ స్థానాలకు, 487 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఎన్నికలను శాంతి యుతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, నిర్వహించేందుకు పోలీసుశాఖ అన్ని భద్రతా చర్యలను చేపట్టిందన్నారు.

ఇందులో భాగంగా ఎన్నికల్లో సమస్యలు సృష్టించేందుకు అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగా గుర్తించి, వారిని మంచి ప్రవర్తన కొరకు బైండోవరు చేయడమైందన్నారు. ఇప్పటికే తుపాకులును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

76 అతి సున్నిత, 115 సున్నిత పోలింగు కేంద్రాలను జిల్లాలో గుర్తించామన్నారు. ఎన్నికలను శాంతి యుతంగా నిర్వహించేందుకు పోలీసు సిబ్బంది, హెూంగార్డులు, ఇతర యూనిఫారం సర్వీసులు, సచివాలయంలో పని చేస్తున్న మహిళా సంరక్షణ పోలీసులతోపాటు, ఇంజనీరింగు అసిస్టెంటులు, సర్వేయర్లు, వెల్ఫేర్ అసిస్టెంటులు, ఎడ్యుకేషన్ అసిస్టెంటులతో సుమారు 6,000 వేల మంది బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

మహిళా సంరక్షణ పోలీసు లతో పాటు సచివాలయ సిబ్బందిని పోలింగ్ బూత్ ల వద్ద క్యూలైన్లు క్రమబద్దీకరించేందుకు వినియోగస్తున్నామన్నారు.

శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు అదనపు ఎస్పీ, డిఎస్పీ స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించి నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఓటర్లు భౌతిక దూరం పాటించేవిధంగా నిలుచునేందుకు సర్క్ ళ్లు  గీయించాలన్నారు. పోలింగ్ బూతుకు 100 మీటర్ల దూరంలో లైనులు ఏర్పాటు చేయాలని, ఓటర్లును తప్ప, ఇతరులెవరినీ 100 మీటర్లు లోపలికి అనుమతించవద్దన్నారు.

పోలింగ్ బూత్ కు 100 మీటర్ల రేడియేషన్ లోపల ప్రజలను గుమిగూడకుండా 144 సీఆర్పీసీ సెక్షనను అమలు చేయాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

అవసరమైతే వీడియోగ్రఫీ, పోటోగ్రఫీ, బాడీవార్న్ కెమారాలు, పబ్లిక్ ఎడ్రసింగ్ సిస్టమ్స్ ఉపయోగించాలన్నారు. ఓటర్లు స్వేచ్చాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించేవిధంగా చర్యలు తీసుకొంటున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఎన్నికల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండాను, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరుగుతున్నట్లుగా సమాచారం అందినా, వెంటనే సంఘటనా స్థలంకు చేరుకొనే విధంగా, తక్షణమే స్పందించేందుకు రూట్ మొబైల్స్ ను, ( స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ కింగు ఫోర్స్ లను ఏర్పాటు చేసామన్నారు.

ఈ ఎన్నికల్లో దాదాపు 6 వేల సిబ్బందిని వినియోగిస్తున్నామని, ఒక్కొక్క మండలంలో ఎన్నికల సందర్భంగా పరిస్థితిని సమీక్షించేందుకు ఒక్కొక్క ప్రత్యేకాధికారిగా ఉన్నతాధికారులను నియమిస్తున్నామని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు.

Related posts

త్యాగం తెలంగాణ ప్రజలది భోగం కల్వకుంట కుటుంబానిది

Satyam NEWS

మండుటెండలో ఎన్టీఆర్ కు టీడీపీ నివాళి…!

Bhavani

చక చకా పని చేస్తున్న మల్లికార్జున ఖర్గే

Satyam NEWS

Leave a Comment