29.7 C
Hyderabad
April 29, 2024 10: 09 AM
Slider తూర్పుగోదావరి

క్రైమ్ కార్నర్: పోలీసులు అదుపు లో చిట్టీల మహిళ

#mudekalyani

తూర్పుగోదావరి జిల్లా మండపేట లో ఓ లేడి రూ కోటి కి పైగా టోకరా వేసిన విషయం విదితమే. చీటీలు పేరుతో భారీగా మోసానికి పాల్పడ్డ ఈ ఘనటలో సూత్రధారి మహిళ ను టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వనీయ సమాచారం. చిట్ ఫండ్ లో ఆమెకు రావాల్సిన సొమ్ము ఇవ్వాల్సిన వారికి జమ చేసేలా మంతనాలు సాగుతున్నట్లు బాధితులు చెప్పారు. ఇప్పుడైన తమకు న్యాయం జరుతుందో లేదోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు రూ కోటి వరకు జనం సొమ్మును దిగమింగి పరారైనట్లు బాధితులు చెబుతున్నారు.  పది రోజుల క్రితం టౌన్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మండపేట న్యూ కాలని చర్చి వీధిలో మూడే కళ్యాణి ని పోలీసులు అదుపులోకి తీసున్నట్లు సమాచారం. ఈమె భర్త అనిల్ గత కొన్నేళ్లుగా దుబాయ్ ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈమె ఆరేళ్ళ క్రితం నుండి చిట్ ఫండ్ నిర్వహిస్తోంది. రూ 20 లక్షలు, రూ 10 లక్షలు, రూ 5 లక్షలు, రూ 2 లక్ష లు వంటివి మొత్తం 30 లాట్లు చీటీలు నడుపుతుంది.

భర్త దుబాయ్ లో మంచి సంపాదన లో ఉన్నాడని అందరినీ నమ్మించేది. ఆరు ఏళ్లుగా చిటి పాట అయిన వెంటనే సొమ్ము ఇస్తుండటం తో చాలా మంది ఈమె వద్ద చిన్న చీటీలు నుండి పెద్ద చీటీలు వేసేవారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కనిపించక పోవడంతో బాధితులు  పోలీసులను ఆశ్రయించారు. కొండక వీర చంద్ర కుమార్ అనే బాధితుని ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆమె పోలీసులకు చిక్కడం తో ఈ చీటింగ్ కు సబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఆమె ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ధృవీకరించడం లేదు. కేసు దర్యాప్తులో ఉందని మాత్రమే చెబుతున్నారు.

Related posts

కర్ఫ్యూ సడలింపు: నిబంధనల అమలుపై సడలిన ఖాకీలు..!

Satyam NEWS

9 నెలల బాలికను రేప్ చేసినా ఉరిశిక్ష వేయరా?

Satyam NEWS

స్లేవరీ:9 నెలలుగా జీతం లేక ప్రొఫెస‌ర్ ఆత్మ‌హ‌త్య‌

Satyam NEWS

Leave a Comment