దసరా శెలవులకు ఊరికెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ దసరా హడావుడిలో ఉంటి ఇంటి విషయంలో అజాగ్రత్తగా ఉంటే దొంగలు తమ పనిలో తాము ఉంటారు. అందుకే దసరాకి ఊరికి వెళ్ళేవారికి దొంగతనాల నివారణకు పోలీస్ వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. 1. ఇంటిముందు తలుపులకు సెంట్రల్ లాక్ వేసి బయట బేడం పెట్టకండి 2.ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచండి. 3. బయట గేట్ లోపల నుండి తాళం వేయండి.4.ఇంట్లో ముందు గదిలో లైట్ వేసి ఉంచండి.5.పేపర్ బాయ్ కి పేపర్ వొద్దని చెప్పండి.6.ఇంట్లో ఇనుప బీరువా లో ఎట్టిపరిస్థితుల్లో నగదు, బంగారు ఆభరణాలు దాయకండి. ఇనుప బీరువా దొంగలకు శుభ సూచిక.7. బయటకు వెళ్ళేటప్పుడు, బతకమ్మ ఆడేటపుడు మీ మెడలో బంగారం జాగ్రత్త. 8. మీ ఇంట్లో, గల్లీలో సీసీ కెమెరాలు పెట్టుకోండి.9. మీకు ఎవ్వరిమీదన్నా అనుమనమొస్తే 100 కి కాల్ చెయ్యండి.10. మీరు ఇంటికి తాళం వేస్తే మాకు చెప్పండి.ఈ సూచనలు పాటిద్దాం, దొంగతనాల్ని నివారిద్దామని కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి కోరారు. అందరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు
previous post
next post