28.7 C
Hyderabad
April 27, 2024 06: 48 AM
Slider ఖమ్మం

జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్

#job

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పరిశీలించారు.21వ తేదీన జరిగే జాబ్ మేళాకు 15 వేల మంది నిరుద్యోగ యువతీ యువకులు రానున్న నేపథ్యంలో పోలీస్ కమిషనర్ నగరంలోని SBIT ఇంజనీరింగ్ కాలేజ్ ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఏలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బంది చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఆనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ….

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా వివిధ ప్రముఖ కంపెనీలను ఒప్పించి జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐటీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌, విప్రో వంటి సంస్థలు, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు మేళాలో పాల్గొంటున్నట్లు తెలిపారు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్హత కలిగిన దాదాపు 8 వేల మందికి పైగా ఈ జాబ్ మేళా ద్వారా ప్రవేటు, కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన వివరించారు.

కేవలం శాంతి భద్రతల పరిరక్షణకు మాత్రమే పరిమితం కాకుండా కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నిరుద్యోగ యువతకు పోలీస్ రిక్రూట్మెంట్ లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం జాబ్ మేళాలను సైతం నిర్వహిస్తూ ఆదర్శవంతమైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, టౌన్ ఏసీపీ గణేష్ ,ఎస్బీ ఏసీపీ ప్రసన్న కుమార్, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్ పాల్గొన్నారు.

Related posts

[Over-The-Counter] < Sex Pills Reviews Duragan Male Enhancement

Bhavani

బీఆర్ఎస్ బీజేపీలు ఎప్పటికి ఒక్కటి కాలేవు

Satyam NEWS

కాంగ్రెస్ అన్యాయం చేసింది: బీజేపీ ఎల్లారెడ్డి అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment