39.2 C
Hyderabad
April 30, 2024 22: 36 PM
Slider తెలంగాణ ముఖ్యంశాలు

ఏబిఎన్ ఓవర్ యాక్షన్: పోలీసుల కట్టడి

abn poll

అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రసారమాధ్యమాలు జాగ్రత్తగా మెలగాలని పోలీసు విభాగం చాలా సార్లు చెప్పినా కొందరికి అర్ధం కాలేదు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ఏమేం చేయాలో ఏమేం చేయకూడదో స్పష్టంగా గైడ్ లైన్స్ కూడా పంపారు. దాదాపుగా అందరూ పోలీసుల సూచనలు పాటించారు. కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి మాత్రం పోలీసు సూచనలు అర్ధం అయినట్లు లేదు. ట్విట్టర్ లో అయోధ్య తీర్పు పై బహిరంగంగా అభిప్రాయ సేకరణ ప్రారంభించింది. అయోధ్య పై సుప్రీంకోర్ట్ తీర్పును మీరు సమ్మతిస్తున్నారా? అని ఓ ప్రశ్న వేసి ట్విట్టర్ లో పెట్టారు. దానికి అవును, కాదు అని సమాధానాలు పెట్టి వాటిపై ఓటు వేసే విధంగా కోరారు. దీనిపై చాలా మంది స్పందించారు కూడా. అయితే ఈ విషయం పోలీసులకు తెలిసిపోయింది. వారు తక్షణమే స్పందించి ఈ పోల్ ను తీసేయాల్సిందిగా ఆంధ్రజ్యోతిని కోరారు. ప్లీజ్ డిలీట్ ది పోల్ అంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్టర్ లోనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని రిక్వెస్టు చేశారు. దీనికి ఎంతో మంది స్పందించారు. సాధారణ పౌరులను బెదిరించే పోలీసులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని రిక్వెస్టు చేయడం ఏమిటని ట్విట్లర్ లో పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Related posts

బాధ్యతలేని ముఖ్యమంత్రి కార్యాలయం మెడకు ఉచ్చు లాంటిదే

Satyam NEWS

కోమా…కరోనా…కోలుకోలేక శాశ్వత నిద్ర

Satyam NEWS

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment