27.7 C
Hyderabad
April 30, 2024 09: 37 AM
Slider తెలంగాణ

సెర్చ్ వారెంట్ :పబ్బుయాజమాన్యం నిర్వాహకులకై వేట

police searching

వ్యాపార అభివృద్ధి కొరకు అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు వ్యభిచారం నిర్వహిస్తున్న రేవ్ పార్టీ నిర్వాహకులు పబ్ యజమానులు పరారీలో ఉండగా వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్బులో రేవ్‌ పార్టీ నిర్వహించి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10లోని ఓ పబ్బులో ఈ రేవ్‌ పార్టీ నిర్వహించేందుకు ప్రయత్నించారు.

వివిధ రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చారు. అశ్లీల నృత్యాలు చేయించేందుకు ప్రయత్నించారు. ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల తనిఖీ అనంతరం పబ్బు యజమానులైన సంతోష్‌రెడ్డి, భరత్‌లు, రేవ్‌ పార్టీ నిర్వాహకులు ప్రసాద్‌, శ్రీనివాస్‌నాయుడు పరారయ్యారు. పక్కా సమాచారం తో అక్కడికి చేరుకున్న పోలీసులు 21 మంది యువతులను అదుపులోకి తీసుకొని నోటీసులు ఇచ్చి పంపించారు.

విత్తన సంస్థ ప్రతినిధుల కోసం ఈ రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సంస్థను గుర్తించేందుకు, నిర్ధరించేందుకు ప్రయత్నించే క్రమంలో నిర్వాహకులు, పబ్బు యజమానులు పరారీలో ఉండటంతో వారిని పట్టుకొనేందుకు బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.

Related posts

ప్రయాణాల్లో మన భద్రతతోపాటు ఇతరుల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలి

Bhavani

సుప్రీం కోర్టు కు రాహుల్

Bhavani

సంస్కృత కళాశాలలో “వేదవ్యాస సదనం” నిర్మాణానికి జీ హెచ్ వి చేయూత

Satyam NEWS

Leave a Comment