38.2 C
Hyderabad
April 28, 2024 22: 42 PM
Slider ప్రత్యేకం

సంస్కృత కళాశాలలో “వేదవ్యాస సదనం” నిర్మాణానికి జీ హెచ్ వి చేయూత

#Vedapatasala

విజయనగరంలో వందేళ్ల చ‌రిత్ర‌ను సంపాదించుకున్న‌ మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో సంప్ర‌దాయ బ‌ద్ద‌మైన  వేల‌కాలం నాటి వేదాన్ని క‌ళాశాల విద్యార్ధుల‌కు నేర్పించ‌బ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందుకోసం క‌ళాశాల‌లో కొత్త‌గా ఓ ప‌ర్ణ‌శాల నిర్మింప‌బ‌డుతోంది.

అయితే విద్యార్థులకు వేదం బోధించడం కోసం కొత్తగా నిర్మింపబడుతున్న పర్ణశాల “వేదవ్యాస సదనం” నిర్మాణం కోసం జీహెచ్.వీ  చారిటబుల్ ఫౌండేషన్ సభ్యులందరూ 55 వేల 555ల‌ను పొగు చేసింది. పుణ్య‌భూమి,తపోభూమి,వేద భూమి అయిన స‌నాత‌న భార‌త దేశంలో అదీ  వందేళ్ల  క్రితం  స్థాపించ‌బ‌డ్డ  విజ‌య‌న‌గ‌రం మ‌హా రాజా సంస్ర్క‌తిక క‌ళాశాల‌లో ఆ వేదం.. అందుకోసం  చెబుతున్న‌..నిర్మాణ‌మ‌వుతున్న  భ‌వ‌నం కోసం జీహెచ్.వీ  చారిటబుల్ ఫౌండేషన్ ముంద‌కు వ‌చ్చింది.

ఈ మేర‌కు పౌండేష‌న్ స‌మ‌కూర్చిన సొమ్మును. క‌ళాశాల ప్రిన్సిప‌ల్ స్వప్న హైందవికి  అందజేశారు.ఈ  మేర‌కు  కళాశాల పండితులు  శాస్త్రోక్తంగా సభ్యులకు వేదాశీర్వచనం అందించారు. ఈ సంద‌ర్భంగా… జి హెచ్ వి చారిటబుల్ ఫౌండేషన్ కార్యదర్శ  సూర్యలక్ష్మి మాట్లాడుతూ పవిత్రమైన ఉద్దేశంతో ఈ విరాళాన్ని అందజేయ‌డం మా సంస్థకు మరింత స్ఫూర్తిని క‌లిగిస్తోంద‌న్నారు.

పిల్లలకు వేదం నేర్పడానికి ఈ పర్ణశాల ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జి హెచ్ వి సంస్థ సభ్యులు కె ఆర్ కె రాజు, సర్వేశ్వరరావు, హరగోపాల్, రవికుమార్, సుధా నాయర్, డాక్టర్ వెంకటేశ్వరరావు, పద్మలత, చంద్రశేఖర్, సీతారాం, రామకృష్ణ, కృష్ణమోహన్, శంకర్, రామారావు, కల్పన తదితరులు పాల్గొన్నారు

Related posts

సీఎం జగన్ పర్యటనలో పోలీసులదే హడావుడి…!

Satyam NEWS

సీఆర్పీలకు పెరుగుతున్న మద్దతు: 24 వ రోజుకు చేరిన దీక్షలు

Satyam NEWS

తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు మాస్కులు

Satyam NEWS

Leave a Comment