కొల్లాపూర్ మండల పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ను సబ్ ఇన్ స్పెక్టర్ కొంపల్లి మురళి గౌడ్ పట్టుకున్నారు. శనివారం సాయంత్రం మండల పరిధిలోని మొల్ల చింతలపల్లి గ్రామ సమీపంలోని వాగు నుండి అనుమతి లేకుండా అక్రమంగా Ts 31 T 5202 ట్రాక్టర్ కొల్లాపూర్ పట్టణ కేంద్రానికి తరలిస్తుండగా బస్ డిపో ముందర పట్టుకోవడం జరిగిందని ఎసై.మురళి గౌడ్ తెలిపారు. ట్రాక్టర్ యజమాని బొయ్య బక్కన పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇకపై ఎవరైనా అధికారుల నుండి అనుమతి తీసుకోకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
previous post