ఆపదలో ఉన్న కవలపిల్లల్ని ఆదుకునే ప్రయత్నం చేసిన కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన ఎం.రామకృష్ణ కు కవల పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు కుమార్తెల ఆరోగ్యం ప్రమాదకర పరిస్థితుల్లో ఉండి హైద్రాబాద్ లోని రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులను భరించే స్తోమతు లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్న రామకృష్ణ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆరు లక్షల రూపాయలను కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంజూరు చేయించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు విడుదల కావడంతో సంబంధిత పత్రాలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆయనకు అందించారు. ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఆరు లక్షల రూపాయలను ఎమ్మెల్యే ప్రభుత్వం నుండి మంజూరు చేయించినందుకు రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. పిల్లల ఆరోగ్యం కన్నా ఎక్కువ మరేదీ ఉండదని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనను కోరారు.
previous post
next post