గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణం లో కొన్ని ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించింది. ముఖ్యంగా పట్టణ పరిధిలోని ఒకటవ, గ్రామీణ పోలీస్ స్టేషన్ ల వద్ద అండర్ డ్రైనేజీ వ్యవస్థ మరి అధ్వాన్నంగా ఉంది. సమస్యల పరిష్కారం కోసం కొందరు, ఫిర్యాదు ఇవ్వటానికి మరి కొందరు నిత్యం స్టేషన్ ల చుట్టూ తిరుగుతూ ఉంటారు.
ఇదంతా ఒక వైపు అయితే నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండే రక్షక భటులు ప్రతి రోజు మురికి వాసనా పీల్చ లేక అనారోగ్యం బారిన పడుతున్నారు. పురపాలక శాఖ వారికి సదరు పోలీస్ స్టేషన్ ల సి.ఐ లు అనేక సార్లు చెప్పినప్పటికీ పట్టించు కోవటం లేదు అని కొందరు అంటున్నారు. ఇప్పటికైనా పురపాలక శాఖ అధికారులు స్పందించి వెంటనే పోలీస్ స్టేషన్ వద్ద గల అండర్ డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయాలని పోలీస్ వారు, అటుగా వచ్చే వారు కోరుకుంటున్నారు.