33.7 C
Hyderabad
April 29, 2024 02: 48 AM
Slider నల్గొండ

కేంద్ర ఏజెన్సీలను విచ్చలవిడిగా వాడుకుంటున్న బిజెపి

#azeezpasha

నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు మేరకు సోనియా గాంధీకి సంఘీభావం తెలిపేందుకు ఈనెల 21,22వ,తేదీలలో జరిగే నిరసన కార్యక్రమాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని అజీజ్ పాషా కోరారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తన ఇష్టాను రీతిగా మోడీ ఈడి,సిబిఐ లతో దర్యాప్తు జరుపుతూ నెహ్రూ,గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని నిరాధార ఆరోపణలతో కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్ పాషా విమర్శించారు.

ఇందుకు నిరసనగా ఈ నెల 21,22వ, తేదీలలో జరిగే దేశవ్యాప్త నిరసనలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పంపిన సమన్లకు ప్రతిస్పందనగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జూలై 21న,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లనున్నారని, అజీజ్ పాషా తెలిపారు.

ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి బిజెపి ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను ముఖ్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను వాడుకుంటుందని తీవ్రంగా ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన మనీ లాండరింగ్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అజీజ్ పాషా అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ప్రశ్నించడానికి ఈడీ, మరేతర కేంద్ర ఏజెన్సీకి ఎటువంటి ఆధారం లేదని అన్నారు.నేషనల్ హెరాల్డ్ ఇష్యూ అనేది డబ్బు లావాదేవీలు లేకుండా ఒక సాధారణ ఋణం-ఈక్విటీ మార్పిడి అని వివరించారు. లావాదేవీలో డబ్బు ప్రమేయం లేనందున, మనీ లాండరింగ్ అనే ప్రశ్న తలెత్తదని అన్నారు.

నెహ్రూ,గాంధీ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు,కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌ను దిగజార్చేందుకు,ద్రవ్యోల్బణం, భారత్‌లోకి చైనా చొరబాటు తదితర వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ ప్రభుత్వం ఈడీని ఉపయోగిస్తుందని అజీజ్ పాషా అన్నారు.

ఈక్విటీకి మార్పిడి అనేది ఋణాలిచ్చే బ్యాంకులు తరచుగా చేసే ఒక సాధారణ ప్రక్రియ అని,గతంలో మూసివేసిన నేషనల్ హెరాల్డ్ ఇష్యూను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తిరగదొడిందని పాషా తీవ్రంగా విమర్శించారు. సోనియా గాంధీని ఇబ్బంది పెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు చూస్తూ ఊరుకోరని అన్నారు. ఈ శతాబ్దపు గొప్ప నాయకులలో సోనియా గాంధీ ఒకరని అభివర్ణించారు.

నెహ్రూ,గాంధీ కుటుంబం దేశం కోసం అనేక త్యాగాలు చేసిందని,దేశ సమగ్రత కోసం మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ అమరులయ్యారని అన్నారు. 2004-2014 మధ్య యూపీఏ ప్రభుత్వంలో రెండు దఫాలుగా ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా సోనియా గాంధీ అత్యున్నత పదవిని త్యాగం చేశారని గుర్తుచేశారు.నెహ్రూ,గాంధీ కుటుంబం ఎప్పుడూ ఎలాంటి పదవికి ఆశపడకుండా నిస్వార్థంగా దేశానికి సేవ చేశారని అన్నారు.

సోనియాగాంధీ నాయకత్వంలో అప్పటి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విప్లవాత్మక చట్టాలు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌, ఆహారభద్రత చట్టం,సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ), విద్యాహక్కు(ఆర్‌టీఈ) వంటి చట్టాలను తీసుకొచ్చిందని అజీజ్ పాషా అన్నారు. ప్రత్యర్థి పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్‌ను వేధించడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తున్న బిజెపి ప్రభుత్వం తమ పాలనలో ప్రజా సంక్షేమం ప్రక్కన పెట్టి నిత్యావసర వస్తువుల ధరలు,పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్ ధరలను పెంచి నిరుద్యోగ యువతను ఆదుకోకుండా ప్రజలపై పెనుభారం మోపిందని అన్నారు. యుపిఎ ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో సాధారణ ప్రజల సాధికారతపై దృష్టి సారించిందని సోనియా గాంధీ,రాహుల్ గాంధీలను ఆధారాలు లేని కేసులో ఇరికించే కుట్ర చేస్తుందని అన్నారు. సోనియా గాంధీకి సంఘీభావం తెలిపేందుకు ఈనెల 21,22వ,తేదీలలో జరిగే నిరసన కార్యక్రమాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం పెద్ద ఎత్తున పాల్గొనాలని అజీజ్ పాషా కోరారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

ఇసుక రవాణాకు ఇప్పుడు గేట్లు ఎత్తారు

Satyam NEWS

పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలి

Satyam NEWS

తిరుపతిలో మరో ఐదు క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చెయ్యండి

Satyam NEWS

Leave a Comment