42.2 C
Hyderabad
April 26, 2024 15: 32 PM
Slider నిజామాబాద్

ఆశాలకు కరోనా కాలంలో 5 వేలు పారితోషికం ఇవ్వాలి

#Aasha Workers

ఆశా కార్యకర్తలకు కరోనా కాలంలో 5 వేల అదనపు పారితోషికాన్ని ఇస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఆశా కార్యకర్తకు 10 వేల ఫిక్స్డ్ నెలసరి వేతనం చెల్లిస్తూ ఇతర సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు సురేష్ గొండ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించి సుమారు 70 రోజులు దాటింది. నాటి నుండి నేటివరకు కరోనా మహమ్మారిని అరికట్టడంలో ఆశలు కీలక పాత్ర పోషిస్తూ సర్వే లు చేస్తూ జబ్బు బారిన పడినవారిని గుర్తించడం తదితర పనులు చేస్తున్నరని అన్నారు.

ప్రతిరోజూ ఉదయం నుండి అర్ధరాత్రి వరకు గతం కంటే రెట్టింపు స్థాయిలో ఆశలు శ్రమ చేస్తున్నారని కాని ప్రభుత్వం కరోనా ప్రారంభం నుండే ఆశల సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చినట్లుగా ఆశలకు కూడా 5 వేల పారితోషితం చెల్లించాలని అడిగితె కేవలం 750 రూపాయలు ఇచ్చి ప్రభుత్వం తన చేతులు దులుపుకుందన్నారు.

ఇప్పటికైనా ఆశాలు చేస్తున్న శ్రమను గుర్తించి కరోనా కాలం పూర్తయ్యేవరకు ప్రతినెలా 7500 పారితోషికం ఇస్తూ బకాయి పారితోషికాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చెల్లించాలని, ఆశలందరికి కరోనా రాపిడ్ టెస్ట్ లు చేస్తూ మాస్కులు, శానిటైజర్ లు, గ్లౌస్ లు, పిపిఈ కిట్  ఇవ్వాలన్నారు.

కరోనా సందర్బంగా అయ్యే ప్రయాణ ఖర్చులు చెల్లిస్తూ పారితోషికం లేని పనులు ఆశలతో చేయించకూడదని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల్లాగే ఆశలకు జాబ్ చార్ట్ సెలవులు ప్రకటించాలన్నారు. వీటితో పాటు పెండింగ్ లో దీర్ఘ కాలిక  సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Related posts

ఇంటితో బాటు పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచాలి

Satyam NEWS

మంత్రి దయాకర్ రావును కలిసిన ఆదర్శ గ్రామ ప్రతినిధులు

Bhavani

చౌడవాడ ఘటన… పోలీస్ సిబ్బందికి ప్రోత్సాహకాలు

Satyam NEWS

Leave a Comment