37.2 C
Hyderabad
May 2, 2024 14: 15 PM
Slider మహబూబ్ నగర్

పోలీస్ ఫోటోలతో దేనికైనా రెడీ అంటూ ఎమ్మెల్యే భీరం…

#kollapurpolice

వెనుక పోలీసులు  బందోబస్తు ఉన్న  ఫోటోలు పెట్టుకొని దేనికైనా రెడీ అంటూ ఎమ్మెల్యే అనుచరులు ఫోటోలతో పాటలు పెట్టుకుని వీడియోలతో తెగ హంగామా చేస్తున్నారు. పోలీసులు వారి ఉద్యోగ బాధ్యతగా సమాజంలో ప్రముఖులకు బందోబస్తు లో ఉంటారు. అలాంటి ఫోటోలను కూడా ఏదో యుద్ధంలోకి పోతున్నట్టు ఎమ్మెల్యే అనుచరులు వాడుకోవడంపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి.

ఇలా పోలీసుల ఫోటోలను వాడుకుంటూ ఎమ్మెల్యే అనుచరులు సామాన్య ప్రజలను బెదిరింపులు చేస్తున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు ఫొటోలతో బాటు ఇప్పటి వరకూ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి వాడుతున్న పాటను కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొల్లాపూర్ ఎమ్మెల్యే అనుచరులు వాడుకుంటున్నారు. పాట బాగుందని పెట్టుకున్నారో లేక ఇంకా కాంగ్రెస్ వాసనలు పోక అలా రేవంత్ రెడ్డి పాట పెట్టుకుంటున్నారో అర్ధం కావడం లేదని మరి కొందరు అంటున్నారు.

పోలీస్ ల ఫోటోలతో రేవంత్ రెడ్డి పాటలతో సోషల్ మీడియాలో కొల్లాపూర్ ఎమ్మెల్యే అనుచరులు పెడుతున్న పోస్టులు చూస్తే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసినట్లే కనిపిస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికలను ముందుగానే నిర్వహించుకుని మళ్లీ గెలిచారు. ఈ సారి కూడా అలానే చేయాలని అనుకుంటున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.

ఈ ప్రచారం నిజమన్నట్లుగానే కొల్లాపూర్ ఎమ్మెల్యే అనుచరులు రేవంత్ రెడ్డి పాటలతో, వెనుక పోలీసులు ఉన్న ఫొటోలతో హల్ చల్ చేస్తున్నారు. దేనికైనా రడీ అంటూ పెడుతున్న పోస్టులు ముందస్తు ఎన్నికలకు సంకేతాలు గా ఉన్నాయని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎన్నికల హడావుడి మొదలు కావడంతో మేము చెప్పినట్లు పోలీసులు వింటారు అనే సంకేతాలను ప్రజలకు తెలియజేస్తున్నట్లుగా ఉందని కూడా మరి కొందరు అనుకుంటున్నారు. కొందరు ఎస్ఐలు కూడా ఎమ్మెల్యేకు తొత్తులుగా మారారని, ప్రశ్నించిన ప్రజలపై అక్రమ కేసులు కూడా పెడుతున్నారని స్థానికులు అంటున్నారు. ఎమ్మెల్యే కనుసైగలో పోలీసులు నడుచుకుంటున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవం ఎంతో తెలియదు కానీ ఎమ్మెల్యే అనుచరుల ‘ఓవర్ యాక్షన్’ తో పోలీసుల పరువు కూడా పోతున్నదని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

పాత రామంతపూర్ లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

Satyam NEWS

7 న సరూర్ నగర్ స్టేడియంలో మ్యూజిక్ హంగామా

Satyam NEWS

ఏపీ డీజీపీపై కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment