27.7 C
Hyderabad
April 30, 2024 11: 01 AM
Slider నల్గొండ

అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

#cpm

సూర్యపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడ రెవెన్యూ శివారులో సర్వేనెంబర్ 126,110 లోగల ప్రభుత్వ భూమిలో కుడకుడ, కోమటికుంటలలోని అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి డిమాండ్ చేశారు. సి‌పి‌ఎం అధ్వర్యంలో ఆర్ డీ ఓ  కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుడకుడ రెవిన్యూ శివారులో గల ప్రభుత్వ భూములను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు,భూస్వాములు ఆక్రమిస్తు వ్యాపారం చేస్తున్నారన్నారు. రోజురోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా కుడకుడలో ప్రతి ఒక్క ఇంటిలో రెండు మూడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయన్నారు. కొంతమంది పేదలకు ఇండ్లు లేక కిరాయి ఇండ్లల్లో ఉంటూ అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

గతంలో ఎప్పుడో 50 ఏళ్ల కింద ఇచ్చిన ఇండ్లు తప్ప ఇప్పటివరకు పేదలకు ఇండ్లు గానీ ఇళ్ల స్థలాలు గానీ ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. కుడకుడ చుట్టూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని అన్నారు.గతంలో అనేకసార్లు పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే పాలకులు, అధికారులు పట్టించుకోలేదన్నారు. ఉండటానికి సరైన వసతి లేని పేదలు ఇప్పటికైనా ఇంటి స్థలాలు ఇవ్వాలని గుడిసెలు వేసుకున్నారని, వెంటనే ప్రభుత్వ అధికారులు కుడకుడ, కోమటికుంటలలోని అర్హులైన  పేదలందరినీ గుర్తించి సర్వేనెంబర్ 126,110 లలో ప్రతి ఒక్కరికి 120 గజాల వరకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కోట గోపి, చినపంగి నర్సయ్య, వీరబోయిన రవి కుడకుడ సిపిఎం శాఖ కార్యదర్శి కంచుగట్ల శ్రీనివాస్, సిపిఎం కుడకుడ శాఖ నాయకురాలు పిండిగ నాగమణి పేదలు మర్రి ఎల్లమ్మ,గుండెబోయిన సైదమ్మ,మద్దికుంట్ల స్వాతి, మద్దికుంట్ల సోమలక్ష్మి, ఎల్లమ్మ,రేణుక,సరిత, చంద్రమ్మ, అనిత,ఇమ్రాన్, షరీఫ్,కుమారి,కాసర్ల తిరపమ్మ, రాములమ్మ,పద్మ, నాగమ్మ, సంధ్య, శారదా రమణ,పద్మ,మంగమ్మ, నాగమ్మ,కలమ్మ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Related posts

అప్పుడే పండుగ‌..

Satyam NEWS

వల్కనో ఎఫెక్ట్ : ఫిలిప్పీన్స్‌లో తాల్ అగ్నిపర్వతం బ్లాస్ట్ లావా తో ఇబ్బంది

Satyam NEWS

శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

Sub Editor

Leave a Comment