28.7 C
Hyderabad
April 28, 2024 08: 26 AM
Slider విజయనగరం

పోలీసు త్యాగాల వలనే సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం

#kolagatla

అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా శాసనసభ డిప్యూటీ స్పీకర్  కోలగట్ల వీరభద్రస్వామి

పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంను విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలోగల ‘స్మృతి వనం’లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులు ముఖ్య అథిదులుగా హాజరై, పోలీసు అమరవీరులకు స్మృతి స్థూపం వద్ద నివాళులు అర్పించారు. దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ఈ సంవత్సరం అమరులైన 264 మంది పోలీసుల వివరాలతో కూడిన డిప్యూటీ స్పీకర్  కోటగట్ల వీరభద్రస్వామి ఆవిష్కరించగా, విధులు నిర్వహిస్తూ, తీవ్రవాదుల దాడుల్లో మృతి చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లును ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి చదివి వినిపించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ 1959 సంవత్సరం అక్టోబరు 21 వ తేదీన భారత్-చైనా సరిహద్దుల్లో చైనా రక్షణ బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో మన దేశానికి చెందిన సిఆర్పిఎఫ్ దళం వాకితో వీరోచితంగా పోరాటం చేసి, 10మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. వారి ప్రాణ త్యాగాలకు గుర్తుగా ప్రతీ సంత్సరం అక్టోబరు 21న పోలీసు అమరవీరుల దినోత్సంను నిర్వహించుకుంటున్నామన్నారు.

ప్రాణాలకు వెరవమని పోలీసులు

పోలీసు విధుల్లో చేరినపుడు ప్రతీ పోలీసు ఉద్యోగి ప్రమాదాలకు వెరవమని, ఎటువంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొంటూ, ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడకుండా విధులు నిర్వర్తిస్తామని ప్రతిజ్ఞ చేస్తారని, అదే విధంగా ఉమ్మడి జిల్లాలో ఎంతో ధైర్య, సాహసాలతో మావోయిస్టుల చర్యలను ఎదుర్కొంటూ విధులు నిర్వహించిన (1) మద్దాడ గాంధీ సి.ఐ (2) షేక్ ఇష్మాయిల్, ఎఆర్ కానిస్టేబులు (3) బి. శ్రీరాములు, కానిస్టేబుల్, (4) చిట్టిపంతులు చిరంజీవి, కానిస్టేబులు (5) ఎస్. సూర్యనారాయణ, కానిస్టేబులు మావోయిస్టుల దుశ్చర్యలకు బలయ్యారన్నారు.

పోలీసుల ఉద్యోగులు, తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తూ, సమాజ పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తున్నారన్నారు. సమాజ భద్రత, సామరస్యానికి, శాంతికి పోలీసులు విశేషంగా కృషి చేస్తున్నారని, విధి నిర్వహణలో పోలీసుల చేస్తున్న త్యాగాల కారణంగానే నేడు మనం సమాజంలో స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. అసాంఘిక శక్తులపై జరిగిన పోరాటంలో విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసు కుటుంబాలకు తాముఅండగా ఉంటామని డిప్యూటీ స్పీకర్ శ్రీ కోటగట్ల వీరభద్రస్వామి అన్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో పోలీసులు చూపిస్తున్న అంకిత భావం, సేవా దృక్పదం, త్యాగాల వలనే మనమంతా ప్రశాంత వాతావరణంలో ఉంటున్నామన్నారు. పోలీసులు ప్రజల వెన్నంటే నీడలా ఉండడం వలనే నేడు మనం నిద్రపోగలుగుతున్నామని, స్వేచ్ఛగా తిరగగలుగుతున్నామన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులు మనందరిలో చిరంజీవులుగా నిలిచిపోతారన్నారు.

పోలీసు అమర వీరుల కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు తామెల్లపుడు సిద్ధంగా ఉన్నామని, వారికి అండగా ఉంటామని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అనంతరం, అమరులైన పోలీసులను స్మరించుకొంటూ, అమర వీరుల స్మృతి స్థూపం వద్ద పుష్ప గుచ్ఛాలను వుంచి డిప్యూటీ స్పీకర్  కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు పివివి సూర్యనారాయణ రాజు, ఇందుకూరి రఘురాజు, పాలకపాటి రఘువర్మ, జాయింట్ కలెక్టరు మయూర్ అశోక్, విజయనగరం ట్రాఫిక్ డిఎస్పీ ఎల్. మోహన రావు, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, డిటిసి డిఎస్పీ వీరకుమార్, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, డిపిఓ ఎఓ వెంకట రమణ, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు మరియు పలువురు సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

తుపాకి విన్యాసంతో ఘన నివాళి

రిజర్వు ఇన్స్పెక్టరు చిరంజీవిరావు ఆధ్వర్యంలో పోలీసులు పరేడ్ నిర్వహించ గా, అమర వీరులకు తుపాకుల విన్యాసంతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వన్ టౌన్  సిఐ డా.బి. వెంకటరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరిస్తూ, కొద్దిసేపు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా ఎస్పీ ఎం. దీపిక, జాయింట్ కలెక్టరు మయూర్ అశోక్, ఎమ్మెల్సీలు పివివి సూర్యనారాయణ రాజు, పి.రఘువర్మ, ఇందుకూరి రఘురాజు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం ట్రాఫిక్ డిఎస్పీ డిఎస్పీ ఎల్. మోహన రావు, ఎస్సీ  ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ బి. మోహనరావు, డిటిసి డిఎస్పీ వీరకుమార్, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, డిపిఓ ఎఓ వెంకట రమణ, డిపిఒ పర్యవేక్షకులు ప్రభాకరరావు, పోలీసు అసోసియేషను రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరావు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, పలువురు సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.

Related posts

వచ్చే నెల 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Satyam NEWS

రవాణా శాఖ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

రోడ్డు ప్రమాదం లో నీట్ విద్యార్థిని మృతి

Satyam NEWS

Leave a Comment