29.7 C
Hyderabad
April 29, 2024 10: 48 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో  పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టిన విలేకరులు

#postcard

తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్ట్ హెల్త్ స్కీం పథకాన్ని వెంటనే అమలు చేయాలని టియుడబ్ల్యూజే  (ఐజేయు) జర్నలిస్ట్ యూనియన్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గుండ్రాతి మధు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్- ఐజెయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షుడు మధు గౌడ్ ఆధ్వర్యంలో  పోస్టు  కార్డు ఉద్యమాన్ని నిర్వహించారు.

జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులను పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో ముఖ్యమైందని, అలాంటి జర్నలిస్టులు నేడు స్వరాష్ట్రంలో ఆరోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరించే జర్నలిస్టులు వార్తల సేకరణ విషయంలో తమ తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా పనిచేయడం జరుగుతుందని అన్నారు.

అలాంటి జర్నలిస్టులకు రాష్ట్రంలో ఎక్కడ కూడా జర్నలిస్ట్ హెల్త్ కార్డులు పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రిలో జర్నలిస్టులకు హెల్త్ కార్డు పథకము వెంటనే అమలు చేయాలని ఆయన  డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరావు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు కొంతం ప్రశాంత్, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కొండన్న యాదవ్,  జర్నలిస్టు ఉషన్న, మన తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ రాజు, పికిలి రాము, జిల్లా హెల్త్ కన్వీనర్ గంధం దినేష్, జిల్లా ఎడ్యుకేషన్ కన్వీనర్ కుమార్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి ధ్యారపోగు మన్యం, లట్టుపల్లి రవికాంత్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, సిల్మర్తి ఆంజనేయులు, తరుణ్, విష్ణు, శ్యాంసుందర్, ఫారుక్ పటేల్, విజయ్  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

యాక్షన్ కింగ్ అర్జున్ -క్రికెట్ కింగ్ హర్భజన్ ఫ్రెండ్ షిప్ టీజర్ విడుదల

Satyam NEWS

వానలు రాగానే అన్ని చెరువులు నింపాలి

Satyam NEWS

రుతుక్రమం సమయంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యం

Satyam NEWS

Leave a Comment