30.7 C
Hyderabad
April 29, 2024 05: 31 AM
Slider మహబూబ్ నగర్

సవాయిగూడెం బిజెపి భరోసాలో రామన్న

#bjpwanaparthy

ప్రజా గోస  బిజెపి భరోసా యాత్ర  మూడవరోజు వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో  నిర్వహించారు.  యాత్ర సందర్భంగా రామన్నగారి వెంకటేశ్వర్ రెడ్డి (బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు) అధ్యక్షతన బూత్ అధ్యక్షుడు గణేష్ యాదవ్, డేగ ప్రభాకర్ రెడ్డి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో సిసి రోడ్లు, డ్రైన్స్ ఉచిత సిలిండర్లు, రైతు వేదిక, వైకుంఠ ధమాలు,  అన్ని అభివృద్ధి పనులు నరేంద్రమోడీ  ఇచ్చినటువంటి 80% నిధులతోనే చేశారన్నారు. పరిపాలనలో ఎవరు ఉన్నా నేరుగా సర్పంచులకు నిధులు ఇవ్వడం,  నరేంద్ర మోడీ  గ్రామాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలంటే సందర్భంతో నిరంతరం పని చేస్తున్నారని చెప్పారు.   

గ్రామ ప్రజలు, రైతులు, యువకులు, మహిళలు ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని  సాగనంపాలని  కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి నెరవేరలేదని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవని ఆయన విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, గ్రామంలో దళిత బంధు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎవరికి రాలేదని తెలిపారు.  ప్రజలు చైతన్యవంతమై రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు.

బిజెపిలో కార్యకర్త  నుండి ప్రధానమంత్రి వరకు ఎవరికైనా అవకాశం వస్తుందని,  బిజెపిలో కుటుంబ పరిపాలన లేదని, వ్యక్తి స్వార్థం లేదని, గ్రామాల్లో నరేంద్రమోడీ వల్ల  అనేక సంక్షేమ పథకాలు లబ్ది పొందారని చెప్పారు.  గ్రామంలో గతంలో బిజెపికి సాదరంగా ప్రేమపూర్వకంగా అవకాశం ఇచ్చారని,  రాబోయే రోజుల్లో మళ్ళీ అవకాశం ఇవ్వాలని కోరారు. సవాయి గూడెం నుండి తాటిపాముల మధ్యలో వంతెన  నిర్మాణం చేయాలని, అక్కడ ప్రజలకు వ్యవసాయదారులకు  తీవ్ర ఇబ్బంది కలుగుతుందన్నారు.

సవాయిగూడెం నుండి నాచహళ్లి  వరకు బిటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని, వెంగమ్మ చెరువు అలుగు పారితే వ్యవసాయదారులకు రాకపోకలకు అంతరాయం కలుగుతుందని,  వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.    యాత్రలో  ముఖ్య అతిథులుగా ఎద్దుల రాజ వర్ధన్ రెడ్డి (జిల్లా అధ్యక్షుడు), అయ్యగారి  ప్రభాకర్ రెడ్డి, సబి రెడ్డి వెంకట్ రెడ్డి, బి కృష్ణ, జింకల కృష్ణయ్య (పార్లమెంట్ కో కన్వీనర్) జిల్లా నేతలు కె. మాధవరెడ్డి, డి. నారాయణ, రామన్ గౌడ్, బుడ్డన్న, కార్యదర్శులు పరశురాం, శివారెడ్డి, అధికార ప్రతినిధి పెద్దిరాజు, అధ్యక్షుడు దేవేందర్ నాయుడు ,  పి విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ  బిజెపి నాయకులు మొగిలి నాయుడు, సానే అరుణ్ కుమార్ రెడ్డి, డీ. లక్ష్మీకాంతరెడ్డి, లాలూ యాదవ్, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

దైవదర్శనానికి వెళుతూ 14 మంది మృత్యువు ఒడిలోకి

Satyam NEWS

అయోధ్య రాముడికి విరాళంగా రఘురాముడి 3 నెలల వేతనం

Satyam NEWS

సి‌పి‌ఐ జాతీయ సమితి సభ్యునిగా బాగం

Murali Krishna

Leave a Comment