37.2 C
Hyderabad
May 6, 2024 19: 25 PM
Slider జాతీయం

ప్రశాంత్ భూషన్ కు రూపాయి జరిమానా విధించిన సుప్రీంకోర్టు

#Prashant Bhushan

న్యాయవ్యవస్థను కించపరుస్తూ ట్విట్ చేసిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషన్ కు సుప్రీంకోర్టు ఒక రూపాయి జరిమానా విధించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు నేడు తీర్పు చెప్పింది.

 వచ్చే నెల 15 లోపు సుప్రీంకోర్టు విధించిన జరిమానాను సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. గడువులోపు ఒక రూపాయి జరిమానాను చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో తెలిపారు.

అంతే కాకుండా రూపాయి జరిమానా చెల్లించకపోతే సుప్రీంకోర్టులో మూడు నెలల పాటు బహిష్కరణ ఎదుర్కొవాల్సి కూడా ఉంటుంది. కోర్టు ప్రతిష్టను దిగజార్జిన ప్రశాంత్ భూషన్ కు క్షమాపణ చెప్పేందుకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.

అయితే క్షమాపణ చెప్పేందుకు ఆయన నిరాకరించడంతో నేడు శిక్షను ప్రకటించింది. ప్రశాంత్ భూషన్ ఉద్దేశ్యపూర్వకంగానే కోర్టు ల ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించారని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Related posts

సంక్రాంతికి ఆహ్వానం

Satyam NEWS

జూపల్లి రోడ్‌షో

Bhavani

జగన్ మోహన్ రెడ్డి పాలనలో రెడ్లలోనే అసంతృప్తి ఎందుకు?

Satyam NEWS

Leave a Comment