38.2 C
Hyderabad
April 28, 2024 21: 50 PM
Slider కరీంనగర్

ఇంతవరకు 12,521 లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేశాం

#dalitbandhu

హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు సర్వేను సమర్థవంతంగా నిర్వహించినందులకు జిల్లా కలెక్టర్లు, అధికారులకు రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ,తన్నీరు హరిష్ రావులు మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన మంత్రులు గంగుల కమలాకర్, తన్నీరు హరిష్ రావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, రాష్ట్ర,  జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లతో దళిత బంధు సర్వే, దళిత బంధు అమలు పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రులు దళిత బంధు పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు వరకు హుజురాబాద్ నియోజకవర్గంలోని 12,521 మంది లబ్ధిదారుల అక్కౌంట్ లలో డబ్బులు జమ చేసినట్లు తెలిపారు. మిగితా లబ్ధిదారుల అక్కౌంట్ లలో వేగంగా దళిత బంధు డబ్బులు జమ చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

దళిత బంధు డబ్బులు అక్కౌంట్ లో జమ అయిన అందరికి సెల్ ఫోన్ లో తెలుగులో మెస్సేజ్ రేపో, ఎల్లుండో పంపించాలని మంత్రులు ఆదేశించారు. దళిత బంధు సర్వేలో డోర్ లాక్ ఉన్న , ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినవారు, తప్పిన పోయిన దళిత కుటుంబాల ఇండ్లను కూడా ఈ నెల 12 వ తేదీ నుండి వారం రోజుల్లో  క్షేత్రస్థాయిలో రీ – వెరిఫికేషన్ చేయాలని మంత్రులు నిర్ణయించారు.

దళిత బంధు పథకం క్రింద మంజూరైన డబ్బులను ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్చంధంగా ముందుకు వచ్చి దళిత బంధు డబ్బులు ఆర్థికంగా ఉన్న మాకు వద్దని, ఈ డబ్బులను ఇతర పేద దళిత కుటుంబాలకు సహాయం అందించాలని  గీవ్ ఇట్ అఫ్ (Give it up) అని ఇచ్చినందుకు  ఉద్యోగులను మంత్రులు అభినందనలు తెలిపారు.

18 సంవత్సరాలలోపు తల్లిదండ్రులు లేని  14 మంది అనాధ పిల్లలకు మానవత దృక్పథంతో వెంటనే దళిత బంధు పథకం మంజూరు చేసి వారి అక్కౌంట్ లో డబ్బులు జమ చేయాలని మంత్రులు నిర్ణయించారు. దళిత బంధు పథకంలో డైయిరీ యూనిట్లను ఎంచుకున్న లబ్ధిదారులకు మొదటి ప్రాధాన్యతగా కరీంనగర్, విజయ డైయిరీ భాగస్వామ్యంతో యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని మంత్రులు నిర్ణయించారు. దళితులైన ప్రభుత్వ ఉద్యోగులందరికి కూడా  బ్యాంక్ అక్కౌంట్ లలో దళిత బంధు పథకం డబ్బులు జమ చేయాలని నిర్ణయించారు.

దళిత బంధు సర్వేలో కార్లు కొనుగోలుకు 3,200 మంది, ట్రాక్టర్ల కొనుగోలుకు 3,200 మంది తీసుకొనుటకు తమ ఆప్షన్ ఇచ్చారని, ఇన్ని కార్లు, ట్రాక్టర్లు నడవడం కష్టం కనుక తిరిగి అధికారులు వారి ఇంటికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రత్యామ్నాయ ఉపాధి యూనిట్లు ఎన్నుకొనుటకు కౌన్సిలింగ్ ఇవ్వాలని అధికారులకు  సూచించారు.

త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో మెడికల్, ఫర్టిలైజర్, వైన్స్, సివిల్ సప్లయ్ షాపులు, రెసిడెన్షియల్ స్కూల్, వసతి గృహాలలో, ఆసుపత్రులు తదితర రంగాలలో   రిజర్వేషన్ కల్పించెందుకు త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు వస్తాయని, అందులో కూడా ఉపాధి అవకాశాలు పొందవచ్చనని  అధికారులు లబ్ధిదారులకు  వివరించాలని మంత్రులు తెలిపారు.

దళిత బంధు పథకంలో ఒకే లబ్ధిదారుడు 2 -3 యూనిట్లు తీసుకొని (ఉదా: ఒక ఆటో, నాలుగు పాడి పశువులు) అవకాశం ఉందని అధికారులు లబ్ధిదారులకు తెలియజేయాలని మంత్రులు తెలిపారు. ఆగష్టు 16 న హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం ప్రారంభం సందర్భంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా మంజూరు చేసిన 15 మంది లబ్ధిదారులలో ఇంతవరకు 6 గురు లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ చేయడం జరిగిందని మంత్రులు తెలిపారు.

ఇందులో ముగ్గురికి ట్రాక్టర్లు, ఒకరి అశోక్ లి ల్యాండ్, ఒకరి క్యాబ్ (కారు), ఒకటి సెంట్రింగ్ యూనిట్ గ్రౌంగ్ చేసినట్లు తెలిపారు. మరో 3 డైయిరీ యూనిట్లు రెండు రోజుల్లో అధికారులు లబ్ధిదారులను పంపించి ఖచ్చితంగా లబ్ధిదారుల సమక్షంలోనే వారు ఎంపిక చేసుకున్న పాడి పశువులనే కొనుగోలు చేసుకునేలా నిర్ణయం తీసుకున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.

ఈ పాడి యూనిట్లకు షెడ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. మిగిలిన 6 గురు లబ్ధిదారుల స్కీముల ఎంపిక త్వరగ పూర్తి చేసి వారం రోజుల్లో గ్రౌండింగ్ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. దళిత బంధు సర్వే ను చక్కగా సమర్థవంతంగా చేసినందులకు కరీంనగర్, హన్మకొండ జిల్లా కలెక్టర్లను, సర్వేలో పాల్గొన్న అధికారులను మంత్రులు అభినందిస్తూ ఇదే స్ఫూర్తిని మొత్తం దళిత బంధు యూనిట్లు గ్రౌండింగ్ అయ్యెంత వరకు కొనసాగించాలని అన్నారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్,  శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, మాజీ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్, నగర మేయర్ వై.సునీల్ రావు, అదనపు కలెక్టర్లు శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, సంధ్యా రాణి, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిషత్ సి.ఈ.వో. ప్రియాంక, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు

Bhavani

ఉనికి కి అభినందనలు

Murali Krishna

కడపలో కరెంటు కోతల కారణంగా ముగ్గురు పసిపిల్లల మృతి

Satyam NEWS

Leave a Comment