ఊపిరి సలపని బాధ్యతలతో బిజీగా ఉండే ప్రధాని నరేంద్రమోడీ నేడు తన పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ వెళ్లి తల్లి సమక్షంలో కాసేపు గడిపారు. ప్రస్తుతం మోడీ తల్లి హీరాబెన్ గాంధీనగర్‌కు సమీపంలోని రైసిన్ గ్రామంలో చిన్నకుమారుడైన పంకజ్ మోడీ దగ్గర ఉంటున్నారు.పుట్టిన రోజు సందర్భంగా మోడీ మంగళవారం తల్లి దగ్గరకు వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకుని ఆమెతో కలిసి కూర్చుని భోజనం చేశారు. అనంతరం తల్లితో, చుట్టుక్కల వారితో కాసేపు ముచ్చటించారు. కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా హీరాబెన్ మోడీకి 501 రూపాయలను బహుమతిగా ఇచ్చారు.
previous post