29.7 C
Hyderabad
May 2, 2024 05: 54 AM
Slider జాతీయం

రాహుల్ గాంధీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

#rahulgandhi

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం లోక్‌సభలో చేసిన ప్రసంగంపై బిజెపి ఎంపి ఎంరు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. భారతదేశాన్ని ఒక దేశంగా కాకుండా రాష్ట్రాల యూనియన్‌గా రాహుల్ గాంధీ అభివర్ణించి దేశానికి అప్రతిష్ట తీసుకువచ్చారని బిజెపి ఎంపి నిషికాంత్ దూబే తన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ  తన వ్యాఖ్యలతో దేశ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆయన తెలిపారు. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులందరికీ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే రాజ్యాంగ హక్కు ఉన్నప్పటికీ, సభా మర్యాదను కాపాడుకోవడం మన ముందున్న కర్తవ్యమని ఆయన అన్నారు. పార్లమెంటు పై ఉన్న గౌరవాన్ని తగ్గించడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించారని ఆయన అన్నారు. వయనాడ్ ఎంపి గా ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ చిన్నపిల్లాడిలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన తెలిపారు. తమిళనాడు లాంటి రాష్ట్రాల ప్రజలు తమను తాము ప్రస్తుత ప్రభుత్వం పాలించడాన్ని అంగీకరించడం లేదని కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇది దేశ ప్రతిష్టకు భంగకరమని ఆయన పేర్కొన్నారు.

Related posts

జర్మనీలో నరేంద్ర మోడీ: ‘‘భారత్ వెలిగిపోతున్నది’’

Satyam NEWS

కుక్కలు బెడద నుండి ప్రజలను కాపాడండి

Bhavani

మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

Leave a Comment