దవీందర్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను తన కారులో తరలిస్తున్న డీఎస్పీ దవీందర్ సింగ్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ”దేశంలో జాతీయ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఖాకీ ఉగ్రవాది వెనుక ఎవరున్నారో దర్యాప్తు జరిపించాలి. దవీందర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి” అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.