31.7 C
Hyderabad
May 2, 2024 10: 28 AM
Slider చిత్తూరు

తిరుపతి భూకబ్జాదారులకు ప్రొఫెసర్ భూమన్ వార్నింగ్

#CPMTirupati

తిరుపతి ప్రజల మంచితనాన్ని, ఓపికను తక్కువ గా అంచనా వెయ్యొద్దని, భూకబ్జా చేసే సెటిల్మెంట్ గ్యాంగులను, రౌడీలను, స్మగ్లర్ లను తరిమి తరిమి తిరుపతి పొలిమేరలు దాటిస్తామని ప్రొఫెసర్ భూమన్ హెచ్చరించారు.

త్వరలో  “మన తిరుపతి – మా తిరుపతి” కార్యక్రమం ద్వారా 10 వేల మంది ప్రజలతో కవాతు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. అవినీతి అధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తామన్నారు.

ప్రజల ఆస్తిల రక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీ లు ఒకే మీదకు రావాలన్నారు.” సేవ్ తిరుపతి ” పేరుతో JAC ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

తిరుపతి లోని సిపిఎం ఆఫీస్ లో నేడు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ భూమన్ తో బాటు సిపిఎం కార్యదర్శి కందారపు మురళి, గోపాల్ రెడ్డి, తిరుపతి ఛాంబర్ ఆఫ్  కామర్స్ ప్రతినిధి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

భూకబ్జాల వ్యవహారాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముందుగానే పసిగట్టి వాటిపై కఠినంగా వ్యవహరించాలని అధికారుల కు ఆదేశాలిచ్చారని భూమన్ అన్నారు. బాధితులు ఎవరైనా ఎమ్మెల్యే ని నేరుగా కలవాలని బహిరంగ లేఖ ద్వారా కోరారన్నారు.

అధికారం ఉన్నా, లేకున్నా ఎప్పటికీ తిరుపతి ప్రజలకు సేవ  చేస్తూనే ఉంటానని ఎమ్మెల్యే చెప్పడాన్ని ఆయన స్వాగతించారు. తిరుపతి ప్రజలంతా ఒక కుటుంబంలా ఉండాలి, సమస్యలను పరిష్కరించుకోవాలి, పోరాడాలని తిరుపతి ప్రజలకు పిలుపునిచ్చారు.

సీతమ్మ, వరదరాజనగర్, మఠం భూముల వ్యవహారాలను పరిష్కరించాలని కోరారు. రిజిస్ట్రేషన్ శాఖ లో అవకతవకలు సరిద్దాలన్నారు. ప్రజల ఆస్తుల రక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీ లు ఒకే వేదిక మీదకు రావాలని భూమన్ కోరారు.

Related posts

శబరిమల యాత్రకు టిఎస్ ఆర్టిసి ప్రత్యేక అద్దె బస్సులు

Satyam NEWS

చంద్రుడు పై భారత్ ఘనవిజయం

Bhavani

రాయలసీమ ప్రాజెక్ట్‌ల భవిష్యత్‌పై టీడీపీ సదస్సు ..

Satyam NEWS

Leave a Comment