32.2 C
Hyderabad
May 1, 2024 23: 24 PM
Slider రంగారెడ్డి

రోస్టర్ కం మెరిట్ ఆధారంగా ఉపాధ్యాయుల ప్రమోషన్లు ఇవ్వాలి

#teachers

ఉపాధ్యాయుల ప్రమోషన్లు గతంలో ఇచ్చినట్లుగా  రోస్టర్ కం మెరిట్ ఆధారంగా ఇవ్వాలని మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ శివార్చక విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా విచ్చేసిన ఆయన కేవలం మెరిట్ ఆధారంగా ప్రమోషన్ లిస్టు తయారు చేయడం వల్ల గతంలో రిజర్వేషన్లలో ఎంపికైన బిసి అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, గతంలో కూడా మెరిట్ కం రోస్టర్ ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.

ప్రభుత్వం గతంలో ప్రకటించిన పదివేల ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్లను కూడా ఈ ప్రమోషన్లలో చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్ 2 పండిట్ పోస్టులను గ్రేడ్ 1 పోస్టులు గా అప్గ్రేడ్ చేసి ఈ ప్రమోషన్ లోనే పండిట్ల మరియు పీఈటి ప్రమోషన్ల చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించుటకు కావలసిన సూచనలు ప్రభుత్వాలకు అందించాలంటే చట్టసభలకు ఒక మేధావిని పంపించాలని ఉపాధ్యాయ లోకాన్ని కోరడం జరిగింది.

విద్యా వ్యవస్థలో ఒక మార్పును ప్రవేశపెట్టడానికై ఉపాధ్యాయులు అందరూ ఒక్క అవకాశాన్ని బహుజన ఉపాధ్యాయుల ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ శివార్చకం విజయ్ కుమార్ ని బలపరచాలని బహుజన ఉపాధ్యాయుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె.కృష్ణుడు ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పి. మల్లికార్జున్, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి. భాస్కర్, సి.వెంకటయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

సందీప్ కిష‌న్ ఏ1 ఎక్స్‌ప్రెస్ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌!

Satyam NEWS

27 న దేశ వ్యాప్త బంద్ జ‌య‌ప్ర‌దం చేయాలని కోరుతూ సీపీఎం ర్యాలీ

Satyam NEWS

కంగ్రాట్స్: కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కు కేసీఆర్ అభినందన

Satyam NEWS

Leave a Comment