నరేంద్ర మోడీ ప్రధానిగా రెండో సారి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం లపై కక్ష సాధించే విధంగా ప్రవర్తిస్తున్నారని సీపీఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గఫుర్ విమర్శించారు. కడప జిల్లా రాజంపేట పట్టణం లో ఆర్.బి.బంగ్లా వద్ద ఆదివారం నాడు పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ ఆర్ సి, ఎన్ పి ఏలకు వ్యతిరేకంగా ప్రజాగర్జన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో గఫూర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ప్రజా గర్జన కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమరనాధరెడ్డి మాట్లాడుతూ దేశంలో ఉన్న ముస్లిమ్ లను అర్ధం కాని పదాలతో వారిని పౌరసత్వం ఇప్పుడు అడగడం దారుణం అన్నారు. ఇంకా ఈ సభలో వక్తలు ఎన్ ఆర్ సి బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సభలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫుర్, రాజంపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమరనాధరెడ్డి, జిల్లా సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య , సీపీఎం జిల్లా నేత ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. ముస్లింలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.