35.2 C
Hyderabad
April 27, 2024 12: 21 PM
Slider ఆధ్యాత్మికం

జ‌న‌వ‌రి 19 వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

tirumala

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 26 నుండి 2020, జ‌న‌వ‌రి 19 వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సాధారణంగా ధనుర్మాసంలో  వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందుగా శ్రీవారి సన్నిధిలో దివ్యప్రబంధ అధ్యయనంగా పిలిచే ఈ అధ్యయనోత్సవం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జీయంగార్లు గోష్ఠిగానం చేస్తారు.

ఆళ్వార్‌ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను 25 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు. తొలి 11 రోజులను పగల్‌పత్తు అని, మిగిలిన 10 రోజులను రాపత్తు అని వ్యవహరిస్తారు. 22వ రోజున కణ్ణినున్‌ శిరుత్తాంబు, 23వ రోజున రామానుజ నూట్రందాది, 24వ రోజున శ్రీవరాహస్వామివారి సాత్తుమొర, 25వ రోజున అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి.

Related posts

భాగ్యనగరంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో నిరసన

Satyam NEWS

కామెంట్: సిఎం ది అత్యంత క్రూరమైన మనస్తత్వం

Satyam NEWS

సచివాలయ భవనం కూల్చివేత ప్రక్రియ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment