25.2 C
Hyderabad
May 8, 2024 08: 45 AM
Slider శ్రీకాకుళం

రైతాంగ, ప్రజా వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలి

#Srikakulam Protest

రైతాంగ, ప్రజా వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్,జనసాహితి శ్రీకాకుళం లో ఆందోళన నిర్వహించారు.

తదుపరి జిల్లా పరిషత్ రోడ్ లో ఉన్న ఏపిటిఎఫ్ కార్యాలయంలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి చావలి శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన రైతాంగ చట్టాలు కార్పొరేట్ సామ్రాజ్యవాద కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని, నిస్సహాయులైన రైతాంగం నుండి కారుచౌకగా పంటలను కొనుగోలు చేస్తాయి అని కంపెనీలు లాభాలు ఆర్జించి రైతులను దివాలా తీసేలా చేస్తాయి అని ప్రజాసాహితి సంపాదకులు పి ఎస్ నాగరాజు చెప్పారు.

నిత్యవసర వస్తువులైన చిరు ధాన్యాలు పప్పులు నూనెగింజలు కూరగాయలు పండ్లు మొదలైన వాటిని తొలగిస్తే చేసిన ఈ చట్టం కేవలం రైతాంగానికి మాత్రమే కాక దేశ ప్రజలందరికీ హానికరమైనది అని ఏపిటిఎఫ్ జిల్లా కార్యదర్శి చావలి శ్రీనివాస్ అన్నారు.

వీ నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రజావ్యతిరేక ఉద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని అన్నారు. జన సమితి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి పి మోహన్ రావు మాట్లాడుతూ బుద్ధిజీవులు గా ఉపాధ్యాయులు కవులు రచయితలు ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరించాలని, ప్రజలను చైతన్యవంతులుగా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఏపిటిఎఫ్ జిల్లా కార్యదర్శి చావలి శ్రీనివాస్, వి నవీన్ కుమార్, దాసరి రామ్మోహన్రావు, రాష్ట్ర కౌన్సిలర్ లు పైడి శ్రీరామ్మూర్తి, సదాశివుని శంకర రావు, ఆర్ వి ఎస్ ఎస్ ప్రసాదరావు, గోరు శ్రీధర్, జనసాహితి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ మోహన్ రావు, 

ప్రజాసాహితి సంపాదకులు పి ఎస్ నాగరాజు, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు పి పోలా రావు, జిల్లా కార్యదర్శి తాండ్ర అరుణ, కుల నిర్మూలన సమితి నుండి మిస్కా కృష్ణయ్య, దండ శ్రీనివాసరావు, బెహరా రమేష్, ఉపాధ్యాయులు ప్రజా సంఘాలు నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు

Satyam NEWS

కాకతీయ విద్యార్థి సునీల్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే

Satyam NEWS

నకిలీ డాక్టర్ ఆటకట్టించిన పోలీసులు

Bhavani

Leave a Comment