37.2 C
Hyderabad
May 2, 2024 11: 44 AM
Slider ముఖ్యంశాలు

కాకతీయ విద్యార్థి సునీల్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే

#SeetakkaMLA

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాగిన తెలంగాణ ఉద్యమం 1200 వందల మంది  విద్యార్థుల ఆత్మ బలిదానాల తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్రంలో నీళ్లు,నిధులు రాలేదని, నియమకాలు అయినా వస్తాయని ఆశపడ్డ విద్యార్థులు ఆశలు అడియాశలు అవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బోడ సునీల్ నాయక్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ఆమె అన్నారు. బొడ సునీల్ కుటుంబానికి ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. ఈ రోజు గూడూరు మండలం రాం సింగ్ తండ లో బో డ సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ధర్నా రస్తో రోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోగా ఉద్యోగుల వయసును 61 సంవత్సరాలకు  పెంచి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు లేవని ఆమె అన్నారు.

రాష్ట్రం  కల్వకుంట్ల కుటుంబం చేతిలో చిక్కుకొని ఉద్యోగాలు లేక, కోచింగ్ సెంటర్ లో పెట్టిన అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వం నుండి ఉద్యోగాల భర్తీ కోసం ఒక లక్ష ఏడు వేల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ముఖ్యమంత్రి గత 7సంవత్సరాలనుండి ఒక్క నోటిఫికేషన్ కూడ ఇవ్వలేదని ఆమె అన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నిస్తున్నామని ఆమె తెలిపారు.

సునీల్ నాయక్ మరణానికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కుటుంబానికి 50లక్షలు ఎక్స్ గ్రేషియా,  కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి రాధ  మాజీ ఎంపీపీ తక్కళ్ళ పల్లి రవీందర్ రావు, మండల అధ్యక్షులు వెంకట ప్రసాద్, జెడ్పీటీసీ పుల్సం పుష్ప లత శ్రీనివాస్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి, అధికార ప్రతినిధి రవళి, యూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నాతో వస్తే అక్రమ నిర్మాణాలు చూపిస్తా: ఎంపీ ఆదాల

Bhavani

నూతన సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శానంపూడి

Satyam NEWS

కల్వకుర్తిలో పట్టపగలే విజృంభిస్తున్న దొంగలు

Satyam NEWS

Leave a Comment