40.2 C
Hyderabad
April 26, 2024 13: 37 PM
Slider విజయనగరం

కరోనా సోకితే జ‌ర్న‌లిస్టుల‌కు బెడ్లు సిద్దం చేసిన విజయనగరం కలెక్టర్

#journalists

క‌రోనా సెకండ్ పుణ్య‌మా సామాన్య ప్ర‌జానీకంతో పాటు క‌లం పెట్ట పాత్రికేయులు కూడా ఆ వైరస్ బారిన ప‌డి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఇలాంటి విప‌త్క‌ర పరిస్థితుల‌పై ఏపీయూ డ‌బ్ల్యూ జే రాష్ట్ర కార్య‌ద‌ర్శి ,సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పీఎస్ఎస్ వీ ప్ర‌సాద్ తోపాటు జిల్లాకు చెందిన జ‌ర్న‌లిస్టులు బూరాడ శ్రీనివాస‌రావు(బూశ్రీ) గణేష్ , వెంకట్ , గాంధీ, పాత్రో , బాలు, రాంగోపాల్ , ఎం.ఎస్ .ఎన్ రాజు, శేఖర్ , నరిసింగరావు, బాబా, దాలిరాజు, బుగత శ్రీను, నీల్ కుమార్ , రమణ.. సూర్య శ్రీనివాస్ లు జిల్లా క‌లెక్ట‌ర్ డా.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ ను ఆయ‌న ఛాంబ‌ర్ లో క‌లిసారు.క‌రోనా బారిన ప‌డ్డ మీడియా మిత్రుల‌కు  జిల్లా యంత్రాంగం చూడాల‌ని విజ్ఙప్తి చేసారు..

కరోనా క్లిష్ట పరిస్ధితుల్లో జ‌ర్న‌లిస్టుల‌క‌ మెరుగైన చికిత్స అందించాల‌ని కోరారు. మాన‌వ‌తాదృక్ప‌ధంతో జ‌ర్న‌లిస్టుల బాధ‌లు  విన్న  క‌లెక్ట‌ర్  సానుకూలంగా స్పందించారు. విజయనగరం డివిజన్ లో అక్రిడేటెడ్ జర్నలిస్ట్ లకు  కరోనా సోకితే స్ధానిక తిరుమల ఆసుపత్రిలో 15 బెడ్లు సిద్ధం చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈమేర‌కు సంబంధిత అధికారులను ఆదేశించారు.

అలాగే పార్వతీపురం డివిజన్ పరిధిలో ఉన్న జర్నలిస్ట్ లకు ఆయా పరిధిలో ఉన్న  ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. ఇక  సెకెండ్ డోస్ వేసుకోసుకోని జర్నలిస్ట్ లకు ఒకటి రెండు రోజుల్లో వ్యాక్సిన్ ఏర్పాటు చేస్తామన్నారు. సెకెండ్ డోస్ వేయించుకోని వారు తమ పేర్ల‌ను డీపీ ఆర్ ఓ దగ్గర నమోదు చేసుకోవాలన్నారు.

Related posts

శివోహం: జ్యోతిర్లింగ శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

Satyam NEWS

రక్తదానం తో ప్రాణాలు నిలబెట్టిన DSR ట్రస్ట్

Satyam NEWS

మొక్కలతోనే మానవ మనుగడ

Bhavani

Leave a Comment