27.7 C
Hyderabad
April 26, 2024 06: 17 AM
Slider ఆదిలాబాద్

పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలి

indrakaran reddy

పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మ‌ల్ మండ‌లం కొండాపూర్ గ్రామంలో నేడు పల్స్ పోలియా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు.

చిన్నారులకు ప్రతి ఏడాది పోలియో చుక్కలు వేయించి అంగవైకల్యాన్ని నివారించాలని అన్నారు. తెలంగాణ‌ను పోలియో రహిత రాష్ట్రంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ విజ‌య‌ల‌క్ష్మి,  ఎఫ్‌ఎసిఎస్‌ చైర్మన్‌ రాంకిషన్‌ రెడ్డి,  వైద్యాధికారులు, సిబ్బంది, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిదులు పాల్గొన్నారు.

Related posts

ప్లాస్టిక్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు

Satyam NEWS

లాక్ డౌన్ కారణంగా ముంచుకొస్తున్న మరో ముప్పు

Satyam NEWS

కోవిడ్ నిబంధనల మేరకే సింహాచలంలో దైవ దర్శనం

Satyam NEWS

Leave a Comment