32.7 C
Hyderabad
April 26, 2024 23: 34 PM
Slider మహబూబ్ నగర్

పాతవారితో పని అయిపోయిందా ఎమ్మెల్యే గారు?

#Kollapur MLA

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలుపు కోసం ఎంతో మంది అనుచరులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారు. లాఠీ దెబ్బెలు తిన్నారు. అనేక అవమానాలు కష్టాలు ఎదుర్కొన్నారు. ఇది జగమెరిగిన సత్యం.

బీరం హర్షవర్ధన్ రెడ్డి  ఎమ్మెల్యేగా అయ్యాక  అధికార పార్టీ టిఆర్ఎస్ లోకి వచ్చారు. హర్షన్న ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటామని అనుచరులు, కార్యకర్తలు ఆయనతో పాటు గులాబి కండువాలు కప్పుకున్నారు. దాంతో అప్పటికే ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీలో  రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి. కొత్త, పాత కారు పార్టీలుగా కొనసాగుతున్నారు. కొన్ని నెలల తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి.

అన్ని పార్టీలు ఏమో కానీ  ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గాలు నువ్వా?నేనా? అనే విధంగా ఎన్నికలు హోరాహోరీగా  జరిగాయి. అప్పుడు నాయకులు, కార్యకర్తలు తమ నాయకుని వర్గానికి చెందిన అభ్యర్థులను గెలిపించడానికి, నాయకుని విలువలు కాపాడడానికి పని చేశారు. ఎంతో రిస్కు తీసుకున్నారు.

పార్టీలు మారడమే సహజమే కానీ…..

ఇది నిజం. మున్సిపల్ రెండవ వార్డు ఎమ్మెల్యే వర్గానికి చెందిన నాయకులు,కార్యకర్తలు ఈ విధంగానే ఎంతో కృషి చేశారు. అక్కడ జూపల్లి వర్గీయులు కూడా అదే విధంగా పనిచేశారు. వారి అభ్యర్థే  గెలిచారు. గెలుపు ఓటములు, పార్టీలు మారడం ఇప్పుడు సర్వసాధారణం అయింది. అయితే కొన్ని రోజుల తరువాత జూపల్లి అభ్యర్థి ఎమ్మెల్యే వర్గానికి వచ్చారు.

అప్పుడు మమ్మల్ని మరిచిపోతారెమోనని ఎమ్మెల్యే పాత వర్గానికి అనుమానం వచ్చింది .ప్రియారిటి ఎవరికి ఉంటుందో ఏమో అని కూడా అనుకున్నారు. ఇప్పుడు ఈ అనుమానం క్లియర్ అయింది. బుధవారం కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ రఘుప్రోలు విజయలక్ష్మి, కౌన్సిలర్ బడా అనిత రమేష్ యాదవ్, కౌన్సిలర్ కృష్ణ, కమిషనర్ వెంకటయ్య హరితహారం మొక్కలు నాటారు.

పాత అనుచరులు కనిపించలేదు

కొత్తగా  బాధ్యతలు తీసుకున్న టిఆర్ఎస్ యూత్ తాలూకా  అధ్యక్షుడు అమర్ నాథ్, మున్సిపల్ అధ్యక్షుడు సూర్య టిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ చారి, యువత సుంకరి శివ తదితరులు వున్నారు. అయితే ఇందులో రెండవ వార్డులో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కోసం పనిచేసిన పాత అనుచరులు లేరు.

ఎమ్మెల్యేను నమ్ముకుంటే ఇంతేనా?

ఇక్కడ చెప్పుకునే విషయం ఏమిటంటే వారికి పిలుపు లేకుండానే కార్యక్రమం జరుపుకున్నారని తెలిసింది. ఇప్పుడు రెండవ వార్డులో ఇదే హాట్ టాఫిక్ అయ్యింది. మొత్తం మీద ఎమ్మెల్యేను నమ్ముకొని వస్తున్న అనుచరవర్గాన్ని పక్కన పెట్టారని చర్చ జోరుదారుగా జరుగుతుంది. కావాలని  అవమానించారని అనుచర వర్గం అనుకుంటున్నారు.

ఇప్పటికే కొల్లాపూర్ రాజకీయాలు హాట్ హాట్

ఎమ్మెల్యే కు తెలిసే జరిగిందా అనికూడా ప్రశ్నించుకుంటున్నారు. లేక మున్సిపల్ ఛైర్మెన్ తీసుకున్న నిర్ణయమా? అని చర్చ జరుగుతుంది. ఇప్పుడు పాత అనుచర వర్గం దారి ఎటు అని మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వీరికి జరిగిన అన్యాయమే రానున్న రోజుల్లో మాకు జరగవచ్చని అనుచరులు, కార్యకర్తలు అనుకుంటే ఏంటి పరిస్థితి. ఇప్పటికే కొల్లాపూర్ రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి.

ఎమ్మెల్యే కు ఓటు వెయ్యని వారు కూడా ఆయన పక్కకు వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు రెండున్నర ఏండ్లలో రావొచ్చు. మేము నలుగేండ్లు ఉంటామని మున్సిపల్ పాలకులు అనుకోని సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారేమో తెలియదు కానీ, ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే ఎంత జాగ్రత్తగా ఉంటే అంతా మంచిది. లేకపోతే ఇలాంటి సంఘటనలు మరిన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి. అనుచర వర్గాన్ని కాపాడుకునే బాధ్యత మరింత ఎక్కువగా వుంది.

Related posts

రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం: క్లీన్ చిట్ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం

Satyam NEWS

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ కు సన్మానం

Satyam NEWS

పంజాబ్‎లో బొగ్గు కొరత.. తగ్గిపోయిన విద్యుత్ ఉత్పత్తి..

Sub Editor

Leave a Comment