29.7 C
Hyderabad
May 2, 2024 06: 24 AM
Slider విజయనగరం

అస్తి, చెత్త పన్ను భారం రద్దుచేయాలంటూ సంతకాల సేకరణ

#vijayanagaram

రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం… ప‌ట్ట‌ణ‌, న‌గ‌ర ప్ర‌జ‌ల‌పై చెత్త‌,ఆస్థి ప‌న్నులు అధికంగా వ‌సూలు చేస్తున్నందుకు నిర‌స‌న‌గా విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణ పౌర సంఘం  సంత‌కాల సేక‌ర‌ణ ఉద్యమం చేప‌ట్టింది. ఈ మేర‌కు న‌గ‌రంలోని కోట జంక్ష‌న్…న‌గ‌ర ప్ర‌జ‌ల నుంచీ త‌మ‌,త‌మ అభిప్రాయాలను కోరుతూ సంత‌కాల ఉద్యమ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది.

ఈ కార్య‌క్ర‌మంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్శ‌ద‌ర్శి రాము,సీఐటీయూ శ్రీనివాస్, ప‌ట్ట‌ణ‌, పౌర‌సంఘ నేత రెడ్డి శంక‌ర‌రావులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రజలపై భారాలు వేసి అస్తి విలువ ఆధారంగా పన్ను వేసేందుకు జి ఓ నెంబర్ 196,197,198 నీ తీసుకొచ్చింది.చెత్త పన్ను నెలకి 90 రూపాయలు ఇంటికి వసూలు చేయాలని అధకారులకు ఆదేశించారు. 

ఈనెల  నెల మొదటి వారంలో నే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇంటింటికీ తిరిగి సచివాలయ సిబ్బంది చెత్త పన్ను నెలకి 90 రూపాయలు కట్టాలని తాకిధు లిస్తున్నారు. ఇంటి పన్ను అస్తి విలువ ఆధారంగా పన్ను వేసేందుకోసం ఇంటికొలతలు తీస్తున్నారు కార్పొరేషన్ లో చెత్త పన్ను వసూలు ఆపకపోతే  మీ ప్రభుత్వాన్ని బుట్ట దాఖలు చేస్తారని వారంతా  హెచ్చరించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఉ త్తరాంధ్ర అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ ఎం. శ్రీనివాస్.,ఐద్వా జిల్లా అధ్యక్షులు రమణమ్మ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రమేష్ చంద్ర పట్నాయక్, . గురజాడ నగర్ అధ్యక్షుడు రాకొడు శ్రీను కేవీ .పీ .ఎస్ . జిల్లా అధ్యక్షులు అర్. ఆనంద్. ఛాంబర్ ఆఫ్ కామర్స అధ్యక్షుడు కాపుగంటి శ్రీని వాసరవు. అమృత రెసిడెన్సీ అధ్యక్షుడు , రవికుమార్ ఎన్జీఓ నేత ,ప్రసాద్. ఎస్ఎఫ్ఐ  జిల్లా కార్యదర్శి రామ్మోహన్. డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు మణికంఠ,  సత్యంఎంటీఆర్ కళాశాల అధ్యాపకలు సంఘం నాయకుడు ఎం. శ్రీకాంత్. లు డాక్టర్ చుక్కా సూర్యనారాయణ లు పాల్గొన్నారు

Related posts

తెలంగాణ విమోచన దినోత్సవం రోజున రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి రాక…!

Satyam NEWS

ఎమ్మెల్యే కార్పొరేటర్ వార్ : శిలాఫలకాల వద్ద కాంగ్రెస్ ఆందోళన

Bhavani

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ఆగిపోయిన ప‌నులు స్టార్ట్ చెయ్యండి సార్లూ…!

Satyam NEWS

Leave a Comment