42.2 C
Hyderabad
May 3, 2024 16: 55 PM
Slider నల్గొండ

ప్రభుత్వ ఆస్తులను మనమే కాపాడుకోవటానికి సమరమే శరణ్యం

#SheetalRoshapathi

నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీ ఆధాని గుప్పెట్లో ఉండి దేశ సంపదను ప్రభుత్వ రంగ సంస్థలను వారికి తాకట్టు పెట్టారని అని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి విమర్శించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం సి ఐ టి యు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పొట్టి శ్రీరాములు సెంటర్ లో అంబానీ, ఆదాని దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన అనంతరం రోషపతి మాట్లాడుతూ ఈనెల ఎనిమిదో తేదీన మంగళవారం రైతుల హక్కుల కోసం జరిగే బందులో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

రైతు సంఘాల పోరాటంలాగే బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, రైల్వే, రక్షణ ఉద్యోగులు, కార్మికులు,రైతులని ఆదర్శంగా తీసుకొని మరో సమరానికి సమాయత్తం కావాలని, ప్రభుత్వ ఆస్తులను మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రధాని మోడీ  ప్రపంచమంతా కరోనా వస్తున్న టైంలో దేశరాజధానిలో వేలాది మంది రైతులు గుంపులు గుంపులుగా ఉండటం కరెక్ట్ కాదని, వ్యవసాయ మూడు చట్టాలు రద్దు చేయాలని, లేకుంటే రైతులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, ఆవేదన వ్యక్తం చేశారు.

డిసెంబర్ 8న జరిగే బందులో వివిధ కార్మిక సంఘాలు, ప్రభుత్వ సంస్థలు, వ్యాపార సంస్థలు,స్వచ్ఛంద సంస్థలతో పాటు పరిశ్రమల యాజమాన్యం కూడా సహకరించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యుడు యలక సోమయ్య గౌడ్, మోసం శ్రీను, సైదులు, ఇంటి రామన్న, చింతకాయల పర్వతాలు, దేశ బోయిన వెంకన్న, గుర్రం కోటేశ్వరరావు, వెంకన్న, మెరిగ దుర్గారావు, లక్ష్మీనారాయణ, గుండెబోయిన వెంకన్న, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Danger level: వరద భయంతో…..గుట్టలపై గుడారాలు

Satyam NEWS

విజయనగరం కలెక్టర్ గా సూర్యకుమారి చెరగని ముద్ర…!

Satyam NEWS

రుణాలపై క్లారిటీ ఇవ్వనున్న అదానీ గ్రూప్

Satyam NEWS

Leave a Comment