42.2 C
Hyderabad
May 3, 2024 15: 56 PM
Slider విజయనగరం

మణిపూర్ లో శాంతిభద్రతలు పరిరక్షించాలి…!

#manipur

దళిత గిరిజన బహుజన మైనార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయనగరం లో వందలాది మందితో వర్షంలో..అదీ రాత్రి పూట  శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కోట జంక్షన్ నుండి  మూడు లంతర్లు గంటస్తంభం అంబేద్కర్ జంక్షన్ వద్దకు చేరుకొని అక్కడ మానవహారం నిర్మించి నినదించారు. ఓ వైఎస్ భారీ వర్షం కురుస్తున్న… చలించకుండా… మణిపూర్ ఘటనపై నినదించారు. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు మాట్లాడుతూ భారతదేశంలో మానవ హక్కులు ప్రశ్నార్ధకమవుతున్నాయని, మానవత్వం నశించిపోతున్నదని మణిపూర్ సంఘటన తేటతెల్లం  చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ సంఘటనలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని శాంతిభద్రతలను పరిరక్షించి పునరావాస చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అలజంగి రవికుమార్ మాట్లాడుతూ కుక్కి నాగా తగలపై జరుగుతున్న మారణ హోమం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మూలించక పోవడం దేశానికి సిగ్గుచేటు అని అన్నారు. జమాతే ఇస్లామీ హింద్  ప్రెసిడెంట్ మహమ్మద్ హబీబ్ మాట్లాడుతూ భారతదేశంలో మతసామరస్యం సామాజిక న్యాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం దేనని సుప్రీంకోర్టు స్పందించనంత వరకు ప్రధానమంత్రి స్పందించకపోవడం చాలా అన్యాయమని అన్నారు.

జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బుంగ బాను మూర్తి మాట్లాడుతూ మణిపూర్ లో జరిగిన దాడి భారత రాజ్యాంగంపై మానవ హక్కుల పై జరిగిన దాడి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మి అప్పలరాజు,  అంబేద్కర్ అందరివాడు సాధన సమితి ఎం సంతోష్ ,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు చెలికి లక్ష్మణ్ , క్రైస్తవ స్త్రీల సమాఖ్య జిల్లా ప్రతినిధి సొరకాయల నిర్మలమ్మ యువత విభాగం డాక్టర్ మోడీ డాక్టర్ అలేఖ్య, డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కోఆర్డినేటర్ కే వరలక్ష్మి దళిత బహుజన శ్రామిక యూనియన్ మహిళా విభాగం కన్వీనర్ చెళికి స్వప్న, సియాధుల పార్వతి, దళిత నేతలు సురగాల విజయ్ కుమార్, దేవుపల్లి సుందర రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. వందలాదిమంది మహిళలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

వివాదం ఉన్న స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు

Satyam NEWS

నేరాల నియంత్రణపై ద్రుష్టి పెట్టాలి

Bhavani

శాస్త్రోక్తంగా తిరుమలలో వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానం

Satyam NEWS

Leave a Comment