38.2 C
Hyderabad
April 27, 2024 15: 17 PM
Slider ముఖ్యంశాలు

రాష్ట్రంలో సైకో పాలన పోయే సమయం వచ్చింది

#ashokgajapatiraju

రాష్ట్రంలో సైకో పాలన పోయే సమయం వచ్చిందని, మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రాబోతోందని టీడీపీ పోలిట్ బ్యూరో స‌భ్య‌లు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు జోస్యం చెప్పారు .పార్టీ 42 వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సందర్బంగా విజయనగరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం అయిన అశోక్ బంగ్లాలో ఆయ‌న ఈ మాట‌లు అన్నారు.

ఎన్టీఆర్ లాంటి త్యాగమూర్తి పెట్టిన టీడీపీ 42 ఏళ్ళు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. 40 ఏళ్ళు టీడీపీ లో అనేక పదవులు చేయడం అదృష్టం గా భావిస్తున్నని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు తెచ్చి పేద ప్రజలకు అండగా ఉన్నది ఎన్టీఆర్, చంద్రబాబే అని అశోక్ గుర్తు చేసారు. ఆయన చేసిన త్యాగాలు మరువులేనివి కూడా స్ప‌ష్టం చేసారు…అశోక్ గ‌జ‌ప‌తి రాజు. అయితే నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి కనబడడం లేదని విధ్వంసం, దోపిడీ, అరెస్టులు మాత్ర‌మే కనిపిస్తున్నాయిఅని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు బ్రోక‌ర్లు గా త‌యార‌ని అశోక్ ఆవేదన వెలిబుచ్చారు. ఇక అభివృద్ది ప‌నులు చూస్తే పోలవరం పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని, భోగాపురం విమానాశ్రయం కోసం రైతులు భూములు త్యాగం చేస్తే వాటిలో కూడా 500 ఎకరాలు తగ్గించారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని విద్యార్థులు కి సరైన భోజనాలు కూడా పెట్టలేని పరిస్థితి క‌ల‌గ‌జేసార‌ని, రాష్ట్రంలో డ్రగ్స్ , గంజాయి తీసుకొచ్చి భవిష్యత్ నాశనం చేస్తున్నారని అశోక్ అన్నారు. రాష్ట్రంలో క్రీడలు పక్కన పెట్టేసి క్రీడాకారులుని రోడ్డున పడేసారని…విజయనగరంలో మాత్రం ఒలింపిక్ క్రీడాకారుడు లాగా స్థానిక ప్రజాప్రతినిథి జల ఆసనాలు చేసి ఊరంతా బ్యానర్లు కట్టుకున్నాడు….అని కోల‌గ‌ట్ల నుద్దేశించి అశోక్ వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌ ఆయన విన్యాసాలు చూడడానికి మంత్రులు, స్పీకర్ రావడం మరో విడ్డురం అని ఎద్దేవా చేసారు.

కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దగ్గర మన హక్కులు గురించి అడిగే దమ్ము లేదని ప్రతిపక్ష పార్టీలు మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి కక్ష సాధింపు చర్యలు చేయడం మాత్రం తెలుసు అని విమ‌ర్శించారు. రాష్ట్రంలో అన్ని తాకట్టు పెట్టడమే పనిగా పెట్టుకుని ఒక సర్కస్ కంపెనీలాగా సీఎం జ‌గ‌న్ తయారుచేశారని అశోక్ తీవ్ర‌స్థాయిలో జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. చివ‌రిగా… రాష్ట్రంలో సైకో పాలన పోయే సమయం వచ్చిందని…మళ్ళీ జైలు కి వెళ్ళడానికి జ‌గ‌న్ సిద్ధంగా ఉన్నారని..రాష్ట్రంలో మూడు పార్టీలు ఉమ్మడి ప్రభుత్వం రానుందని..అందరికి భవిష్యత్ భరోసా ఉంటుంద‌ని డెబ్బై ఏళ్ల అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఓట‌ర్ల కు ధైర్యాన్ని ఇచ్చారు.

Related posts

ములుగు ఉపాధ్యాయులకు గురు స్పందన పురస్కార్

Satyam NEWS

కీలక తీర్పు: అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు

Bhavani

30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో నరసింహపురం విడుదల

Satyam NEWS

Leave a Comment