31.7 C
Hyderabad
May 2, 2024 10: 55 AM
Slider నెల్లూరు

పబ్లిక్ విజిల్: నెల్లూరులో బాలికపై అత్యాచార యత్నం

school van driver

ఎనిమిదవ తరగతి చదివే ఒక బాలికపై అత్యాచార యత్నం చేసిన స్కూల్ వ్యాన్ డ్రైవర్ ను స్థానికులు చితకబాదారు. వాడు నడిపే స్కూల్ వ్యాన్ ను ధ్వంసం చేశారు. నెల్లూరు నగరంలో ఈ దారుణం జరిగింది. నెల్లూరు విద్యావిహార్ స్కూల్ లో 8వ తరగతి చదివే ఒక బాలిక రోజూ స్కూల్ వ్యాన్ లో వెళుతుంది. అదే స్కూల్ లో వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తున్న శివ అనే యువకుడు ఆ బాలికపై కన్నేశాడు.

దీనదయాల్ నగర్ ప్రాంతంలో సమాధుల వద్దకు తీసుకొచ్చి ఆ బాలికపై వాడు అత్యాచార యత్నం చేశాడు. దాంతో ఆ బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చారు. జరుగుతున్న ఘటనను చూసి ఒక్క సారిగా పట్టలేని కోపంతో శివ ను చితకబాదారు. అనంతరం వాడ్ని పోలీసులకు అప్పగించారు. చిన్నారిపై జరిగిన ఈ అఘాయిత్య ప్రయత్నానికి ఆగ్రహించి స్థానికులు స్కూల్ వ్యాన్ ను పూర్తిగా  ధ్వంసం చేశారు.

Related posts

సర్దార్ వల్లభభాయి పటేల్ సేవలు చిరస్మరణీయం

Satyam NEWS

పూర్ణాహుతితో ముగిసిన భవానీ మండల దీక్షలు

Satyam NEWS

ఆపదలో ఉన్నప్పుడు ప్రతి బాలిక 100 కు డయల్ చేయాలి

Satyam NEWS

Leave a Comment